ఆ సినిమాలో కిలికిలి భాష.... మరి ఈ సినిమాలో....?
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి…. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆర్.ఆర్.ఆర్”. ఈ చిత్రం చాలా మంది అతిరథుల సమక్షంలో లో పూజా కార్యక్రమం జరిగింది. అయితే ఈ సినిమా పైన అటు చిత్ర పరిశ్రమ లోనూ, ఇటు ఇద్దరి హీరోల అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి “రామ రావణ రాజ్యం” అనే పేరు వినిపిస్తోంది. అయితే “బాహుబలి” లో కిలికిలి భాషను పరిచయం చేసిన రాజమౌళి…ఇప్పుడు […]
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి…. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో కలిసి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “ఆర్.ఆర్.ఆర్”. ఈ చిత్రం చాలా మంది అతిరథుల సమక్షంలో లో పూజా కార్యక్రమం జరిగింది. అయితే ఈ సినిమా పైన అటు చిత్ర పరిశ్రమ లోనూ, ఇటు ఇద్దరి హీరోల అభిమానుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రానికి “రామ రావణ రాజ్యం” అనే పేరు వినిపిస్తోంది. అయితే “బాహుబలి” లో కిలికిలి భాషను పరిచయం చేసిన రాజమౌళి…ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ తో ఒక కొత్త భాషని మాట్లాడించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. కిలికిలి భాష విషయంలో సహాయం చేసిన మదన్ కర్కి…. ఈ సినిమా లో కొత్త భాషకి సహాయం చేస్తున్నాడట.ఇదే నిజమైతే మనం ఇంకో కొత్త భాషని “ఆర్.ఆర్.ఆర్” లో వినొచ్చు.
ఎన్టీఆర్, రాంచరణ్ ల వేష , భాషలను రాజమౌళి ఏ రకంగా తీర్చిదిద్దుతాడో అని అందరూ చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అటు ఎన్టీఆర్ అభిమానులని…. ఇటు మెగా అభిమానుల్ని ఇద్దరినీ ఈక్వల్ గా బ్యాలన్స్ చెయ్యాలి. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమా జక్కన్న కి కత్తి మీద సాము లాంటిది. కానీ ఎటువంటి నటుడినైనా, కథనైనా అలవోకగా తెరకెక్కించడంలో దిట్ట జక్కన్న. ఈ చిత్రం విడుదలకి ఒకటిన్నర సంవత్సరం వరకు ఆగాలని పిలుపునిచ్చాడు జక్కన్న.
మళ్ళీ తెలుగు సినిమా చరిత్రలో ఇంకో కొత్త భాషతో కొత్త రికార్డులని క్రియేట్ చేయడానికి సిద్ధమౌతున్నాడు జక్కన్న.