సుధీర్ వర్మ, శర్వానంద్ సినిమా ఆగిపోయిందా?

సుధీర్ వర్మ, శర్వానంద్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఒక గ్యాంగ్ సినిమా స్టార్ట్ అయ్యింది. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని గత నవంబర్ లో షూటింగ్ మొదలైంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా లేదు. మళ్ళీ నవంబర్ వచ్చింది కానీ దాని ఊసే లేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ వర్మ స్క్రిప్ట్ శర్వానంద్ కు అంతగా నచ్చలేదట. కొన్ని డౌట్స్ ఉన్నాయట. అందుకే స్క్రిప్ట్ […]

Advertisement
Update:2018-11-12 10:52 IST

సుధీర్ వర్మ, శర్వానంద్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో ఒక గ్యాంగ్ సినిమా స్టార్ట్ అయ్యింది. స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకొని గత నవంబర్ లో షూటింగ్ మొదలైంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా లేదు. మళ్ళీ నవంబర్ వచ్చింది కానీ దాని ఊసే లేదు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ వర్మ స్క్రిప్ట్ శర్వానంద్ కు అంతగా నచ్చలేదట. కొన్ని డౌట్స్ ఉన్నాయట. అందుకే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పాడని అవి పూర్తయితే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. అయితే సుధీర్ వర్మ శర్వ కోసం స్క్రిప్ట్ ని మళ్ళీ రాసే పనిలో పడ్డాడా? లేక వేరే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడా? అన్నది తేలాల్సి ఉంది.

ఇదిలా ఉంటే సుధీర్ వర్మ కెరీర్ లో “స్వామి రారా” ఒక్కటే పెద్ద హిట్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన “దోచేయ్” “కేశవ” సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్స్ గా నిలిచాయి. ఈ విషయం గ్రహించిన శర్వానంద్.. సుధీర్ వర్మతో సినిమా చేయడం ఇష్టం లేకే ఇలా కావాలని అడ్డంకులు పెడుతున్నాడని అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News