బాబు డబ్బుకు బానిసలయ్యారు... అమరావతికి టీ కాంగ్రెస్‌ లిస్ట్

తెలంగాణ కాంగ్రెస్‌పై చంద్రబాబు పూర్తిగా పట్టు సాధిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చు మొత్తం తాను భరిస్తానని చంద్రబాబు రాహుల్‌కు హామీ ఇచ్చారని దాని వల్లే టీ కాంగ్రెస్‌పై చంద్రబాబుకు పట్టుదొరికిందని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు. ఇందుకు జరుగుతున్న పరిణామాలు కూడా బలాన్నిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఎవరుండాలన్నది కూడా పరోక్షంగా చంద్రబాబు శాసిస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను టీడీపీ తరపున తెలంగాణకు తరలించడం ద్వారా అక్కడి స్థానిక పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన వచ్చిందని చంద్రబాబు […]

Advertisement
Update:2018-11-10 05:22 IST

తెలంగాణ కాంగ్రెస్‌పై చంద్రబాబు పూర్తిగా పట్టు సాధిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చు మొత్తం తాను భరిస్తానని చంద్రబాబు రాహుల్‌కు హామీ ఇచ్చారని దాని వల్లే టీ కాంగ్రెస్‌పై చంద్రబాబుకు పట్టుదొరికిందని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారు. ఇందుకు జరుగుతున్న పరిణామాలు కూడా బలాన్నిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఎవరుండాలన్నది కూడా పరోక్షంగా చంద్రబాబు శాసిస్తున్నారు.

ఏపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థను టీడీపీ తరపున తెలంగాణకు తరలించడం ద్వారా అక్కడి స్థానిక పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన వచ్చిందని చంద్రబాబు కాంగ్రెస్ పెద్దలకు చెప్పారు. పైగా వెయ్యి కోట్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ తరపున ఖర్చు చేస్తానని చంద్రబాబు చెప్పడంతో కాంగ్రెస్‌ వారు చంద్రబాబుకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లట్‌ చంద్రబాబు కోసం అమరావతికి వెళ్తున్నారు. టీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు చూపించి దాన్ని ఫైనల్ చేసేందుకు ఆయనను వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పెద్దలు పంపుతున్నారని చెబుతున్నారు. దీంతో టీ కాంగ్రెస్‌ నేతలు లోలోన రగిలిపోతున్నారు. తమ జీవితాలను తిరిగి చంద్రబాబు శాసించడం ఏమిటని మండిపడుతున్నారు.

అయితే చంద్రబాబు డబ్బు, హైకమాండ్‌ ఆదేశాల కారణంగా టీ కాంగ్రెస్‌ నేతలు ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారు. మరోవైపు రాజస్థాన్‌ లోనూ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్‌కు ఆర్ధిక సాయం కోసం చంద్రబాబును కలిసి గెహ్లాట్‌ విజ్ఞప్తి చేసి ఉండవచ్చని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు అవినీతికి అడ్డు అదుపు లేకపోవడం వల్లే ఇప్పుడు ఆ సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలను కూడా శాసిస్తున్నారని టీ కాంగ్రెస్‌ నేతలు కొందరు మండిపడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News