వెంకీ మామ " వరుణ్ బాబు బ్రిడ్జి సమరం

విక్టరీ వెంకటేష్,  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థ  దిల్ రాజు నిర్మాతగా వస్తున్న చిత్రం “ఎఫ్ 2”. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్ ని దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో ఇద్దరు తారలు కూలీ అవతారంలో మాస్ డాన్స్ చేస్తూ కనిపించారు. ఇటీవలే ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ బ్రిడ్జి నిర్మించారని ఆ […]

Advertisement
Update:2018-11-10 03:44 IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థ దిల్ రాజు నిర్మాతగా వస్తున్న చిత్రం “ఎఫ్ 2”. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్ ని దీపావళి సందర్భంగా విడుదల చేశారు. ఇందులో ఇద్దరు తారలు కూలీ అవతారంలో మాస్ డాన్స్ చేస్తూ కనిపించారు.

ఇటీవలే ఈ చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ బ్రిడ్జి నిర్మించారని ఆ బ్రిడ్జి మీద ఒక ఎపిసోడ్ జరగబోతుందని సమాచారం. ఈ ఘట్టం చిత్రంలో అత్యంత హాస్యాస్పదంగా ముఖ్యమైనదిగా ఉంటుందని తెలిసింది. అదే కాకుండా తాజాగా కూలి నెంబర్ ఫోటో పెట్టారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుందని పోస్టు ద్వారా తెలిపారు. ఇది ఒక యువ కథానాయకుడు మరియు అగ్ర కథానాయకుడు కలిసి నటించిన చిత్రం కావటం, ఇద్దరు హాస్యానికి పెద్ద పీట వేసే నటులు, మరియు మాస్ కామెడీ తన మార్క్ తో కొట్టిన అనిల్ రావిపూడి దర్శకుడు అవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ సంక్రాంతికి ఎప్పటిలా వచ్చే భావోద్వేగ మరియు కుటుంబ కథా చిత్రాలే కాకుండా ఇటువంటి మాస్ కామెడీ సినిమా కూడా రావటం మంచి పరిణామమని, సాధారణ ప్రేక్షకులు ఇటువంటి చిత్రాన్ని కూడా ఆదరిస్తారు ఇకనుంచి ఇటువంటివి కూడా సంక్రాంతికి వస్తాయి. ఇది వాటికి మొదలని సినీ పండితులు తమ అభిప్రాయాన్ని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News