చైతు కెరీర్ పై బెంగపెట్టుకున్న సమంతా?
అక్కినేని సమంతా తన భర్త నాగ చైతన్య పట్ల అసంతృప్తిగా ఉందట. దీనికి చైతూ కెరీర్ కారణం అని అంటున్నారు కొంత మంది. అక్కినేని నాగచైతన్య హీరోగా స్టార్ డమ్ ని అందుకోలేకపోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమై దాదాపు దశాబ్ద కాలం అవుతోంది… కానీ స్టార్ డమ్‌ని మాత్రం అందుకోలేక పోతున్నాడు చైతు. అయితే ఈమధ్య మాత్రం వరుసగా ఫ్లాప్స్ ని ఎదుర్కొంటున్నాడు చైతు. “శైలజారెడ్డి అల్లుడు” ఫ్లాప్ కాగా తాజాగా విడుదలైన “సవ్యసాచి” […]
అక్కినేని సమంతా తన భర్త నాగ చైతన్య పట్ల అసంతృప్తిగా ఉందట. దీనికి చైతూ కెరీర్ కారణం అని అంటున్నారు కొంత మంది. అక్కినేని నాగచైతన్య హీరోగా స్టార్ డమ్ ని అందుకోలేకపోతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమై దాదాపు దశాబ్ద కాలం అవుతోంది… కానీ స్టార్ డమ్‌ని మాత్రం అందుకోలేక పోతున్నాడు చైతు.
అయితే ఈమధ్య మాత్రం వరుసగా ఫ్లాప్స్ ని ఎదుర్కొంటున్నాడు చైతు. “శైలజారెడ్డి అల్లుడు” ఫ్లాప్ కాగా తాజాగా విడుదలైన “సవ్యసాచి” కూడా ఫ్లాప్ జాబితాలో చేరిపోయింది. ఇంకా చెప్పాలి అంటే “సవ్యసాచి” కంటే కూడా “శైలజా రెడ్డి అల్లుడు” బెటర్. ఎందుకంటే కనీసం దానికి కొంతలో కొంతైనా మంచి కలెక్షన్స్ అయినా వచ్చాయి. కానీ “సవ్యసాచి” మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. దాంతో తన భర్త కెరీర్ అనుకున్న స్థాయిలో ముందుకు పోవడం లేదని బాధపడుతోందట సమంతా.
ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ “మజిలి” సినిమా కోసం జత కట్టారు. మరి ఈ సినిమాతో అయినా చైతు హిట్ కొట్టి సమంతా ని హ్యాపీ గా ఉంచుతాడో లేదో చూడాలి.