షూటింగ్ కి మందు కొట్టి వచ్చిన హీరోయిన్

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా “టాక్సీ వాలా”. “ది ఎండ్” ఫేం రాహుల్ సంకిర్త్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 17 న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో తెలుగు భామ ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తను షూటింగ్ లో చేసిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక. ఈ సినిమాలో ఒక లాంగ్ సీన్ ఉందట. ఆ సీన్లో మందుకొట్టినట్టు […]

Advertisement
Update:2018-11-07 03:51 IST

విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా “టాక్సీ వాలా”. “ది ఎండ్” ఫేం రాహుల్ సంకిర్త్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నవంబర్ 17 న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో తెలుగు భామ ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తను షూటింగ్ లో చేసిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి చెప్పుకొచ్చింది ప్రియాంక.

ఈ సినిమాలో ఒక లాంగ్ సీన్ ఉందట. ఆ సీన్లో మందుకొట్టినట్టు నటించాల్సి ఉందని దర్శకుడు ప్రియాంకతో చెప్పడంతో ఆమె మందు కొట్టి నటించిందట. కేవలం సహజత్వం కోసం మందుకొట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది ఈ తెలుగు భామ. ఆ సీన్ షూటింగ్ జరిగినన్ని రోజులూ తన క్యారవాన్ లో వోడ్కాను మినిట్ మెయిడ్ తో కలిపి తాగానని.. ఆ మత్తులోనే షూటింగ్ లో పాల్గొన్నానని తెలిపింది. అలాగ ఈ సినిమా షూటింగ్ కోసం మొదటి సారి మందు తాగాను అని చెప్పింది విజయ్ హీరోయిన్. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో తనని హీరోయిన్ గా నిలబెడుతుంది అనే ధీమా వ్యక్తం చేసింది ప్రియాంక.

Tags:    
Advertisement

Similar News