దీపావళి తరువాతే....

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “సై రా” మూవీ యూనిట్ ఇటివలే జార్జియా షెడ్యూల్ ని పూర్తీ చేసుకుని హైదరాబాద్ కి వచ్చారు. ఇక్కడికి రాగానే చిరంజీవి కొన్ని రోజుల పాటు షూట్ కి బ్రేక్ తీసుకున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ దీపావళి తరువాత ఉండబోతుందట. హైదరాబాద్ శివారులో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు మరియు యాక్షన్ […]

Advertisement
Update:2018-11-04 06:24 IST
దీపావళి తరువాతే....
  • whatsapp icon

మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “సై రా” మూవీ యూనిట్ ఇటివలే జార్జియా షెడ్యూల్ ని పూర్తీ చేసుకుని హైదరాబాద్ కి వచ్చారు. ఇక్కడికి రాగానే చిరంజీవి కొన్ని రోజుల పాటు షూట్ కి బ్రేక్ తీసుకున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ దీపావళి తరువాత ఉండబోతుందట. హైదరాబాద్ శివారులో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ ను నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాల షూటింగ్ పూర్తయింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాటను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు నయనతార కూడా నటించబోతుంది. పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను డైరెక్టర్ సురేందర్ రెడ్డి షూట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి…. ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పై రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Tags:    
Advertisement

Similar News