మైత్రీకి మొట్టమొదటి ఫ్లాప్

మైత్రి మూవీ మేకర్స్… ఈ బ్యానర్ కు ఇప్పటివరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలీదు. కనీసం యావరేజ్ హిట్ అనే పదం కూడా వీళ్ల చెవికి తగల్లేదు. అలాంటి హిట్స్ ఇచ్చారు ఈ బ్యానర్ నిర్మాతలు. అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ కు మొట్టమొదటి స్పీడ్ బ్రేకర్ తగిలింది. అది కూడా సవ్యసాచి రూపంలో. అవును..నాగచైతన్యను హీరోగా పెట్టి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తీసిన సవ్యసాచి […]

Advertisement
Update:2018-11-04 02:24 IST
మైత్రీకి మొట్టమొదటి ఫ్లాప్
  • whatsapp icon

మైత్రి మూవీ మేకర్స్… ఈ బ్యానర్ కు ఇప్పటివరకు ఫ్లాప్ అంటే ఏంటో తెలీదు. కనీసం యావరేజ్ హిట్ అనే పదం కూడా వీళ్ల చెవికి తగల్లేదు. అలాంటి హిట్స్ ఇచ్చారు ఈ బ్యానర్ నిర్మాతలు. అలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్ కు మొట్టమొదటి స్పీడ్ బ్రేకర్ తగిలింది. అది కూడా సవ్యసాచి రూపంలో.

అవును..నాగచైతన్యను హీరోగా పెట్టి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తీసిన సవ్యసాచి సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇంకా చెప్పాలంటే సినిమా థియేటర్లలో గట్టిగా నిలబటే రేంజ్ లో లేదు. ఈ వీకెండ్ ముగిసేసరికి సినిమాను ఫ్లాప్ గా డిక్లేర్ చేయడానికి ట్రేడ్ కూడా రెడీగా ఉంది. అలా తమ కెరీర్ లో తొలిసారిగా ఓ ఫ్లాప్ ను చవిచూస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.

మహేష్ బాబుతో వీళ్లు తీసిన శ్రీమంతుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఎన్టీఆర్ తో నిర్మించిన జనతా గ్యారేజ్ కూడా బ్లాక్ బస్టర్ సాధించింది. రీసెంట్ గా రామ్ చరణ్ తో చేసిన రంగస్థలం కూడా బ్లాక్ బస్టర్ సినిమానే. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతూ వస్తున్న మైత్రీ నిర్మాతలకు సవ్యసాచి షాకిచ్చింది.

Tags:    
Advertisement

Similar News