కోడెల కొడుకు వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా.....

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొడుకు శివరాంను భరించలేక పోతున్నామని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ వాటాలు అడుగుతున్నాడంటూ మండిపడుతున్నారు. తాజాగా ఆదివారం మధ్యాహ్నం ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపుకు దిగడం చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ కోడెల శివప్రసాద్ సొంత నియోజకవర్గం నరసరావుపేట. కానీ, అక్కడ ఆయనకు ఉన్న వ్యతిరేకత వల్ల సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ గెలిచిన తరువాత కోడెల కొడుకు శివరాం […]

Advertisement
Update:2018-11-04 08:09 IST

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొడుకు శివరాంను భరించలేక పోతున్నామని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూ వాటాలు అడుగుతున్నాడంటూ మండిపడుతున్నారు. తాజాగా ఆదివారం మధ్యాహ్నం ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపుకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

స్పీకర్ కోడెల శివప్రసాద్ సొంత నియోజకవర్గం నరసరావుపేట. కానీ, అక్కడ ఆయనకు ఉన్న వ్యతిరేకత వల్ల సత్తెనపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక్కడ గెలిచిన తరువాత కోడెల కొడుకు శివరాం రంగ ప్రవేశం చేశారు. ఆయన అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడని బహిరంగంగా చాలా మంది విమర్శిస్తున్నారు.

చివరికి దీపావళి దుకాణాల ఏర్పాటు విషయంలోనూ కోడెల శివరాం వేలు పెట్టేశారు. సత్తెనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ కోడలు, టీడీపీ మహిళా కార్యకర్త దుకాణ ఏర్పాటుకు అనుమతి కోరారట. స్టాల్స్ కు పర్మిషన్‌లకు కోడెల శివరాం అడ్డుపడుతున్నారు అంటూ మహిళ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని మీడియా ముందు వాపోయింది. ‘‘ఎప్పటి నుంచో టీడీపీలో పనిచేస్తున్నాం… కానీ మాకే న్యాయం జరగడం లేదు. ఇటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. పార్టీ వల్ల చాలా నష్టపోయాం ’’ అని వాపోయింది.

ఈ అంశంపై స్పందించని స్పీకర్ కోడెల శివప్రసాద్, తన కొడుకు ఆగడాలను అడ్డుకోలేకపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఛైర్ పర్సన్ కోడలు విషయంలోనే ఈ విధంగా ఉంటే, అక్కడి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొడుకు వల్ల వస్తున్న వ్యతిరేకత, వచ్చే ఎన్నికల్లో కోడెల గెలుపుపై ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.

Tags:    
Advertisement

Similar News