సవ్యసాచి హిట్ అయితే చాణక్య చేస్తా

సవ్యసాచి సినిమా సెట్స్ పైకి రాకముందు మేటర్ ఇది. ఆ టైమ్ లో దర్శకుడు చందు మొండేటి, నాగచైతన్యకు రెండు కథలు వినిపించాడు. వాటిలో ఒకటి సవ్యసాచి. రెండోది చాణక్య. వీటిలో సవ్యసాచిని నాగచైతన్య సెలక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమా హిట్ అయితే చాణక్య కూడా చేస్తానంటున్నాడు. “ప్రేమమ్ టైమ్ లోనే చందు నాకు ఈ రెండు కథలు చెప్పాడు. కానీ చాణక్య స్టోరీ కంటే సవ్యసాచి స్టోరీ నన్ను బాగా కదిలించింది. అందుకే ఇది చేస్తానని […]

Advertisement
Update:2018-11-02 01:27 IST

సవ్యసాచి సినిమా సెట్స్ పైకి రాకముందు మేటర్ ఇది. ఆ టైమ్ లో దర్శకుడు చందు మొండేటి, నాగచైతన్యకు రెండు కథలు వినిపించాడు. వాటిలో ఒకటి సవ్యసాచి. రెండోది చాణక్య. వీటిలో సవ్యసాచిని నాగచైతన్య సెలక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమా హిట్ అయితే చాణక్య కూడా చేస్తానంటున్నాడు.

“ప్రేమమ్ టైమ్ లోనే చందు నాకు ఈ రెండు కథలు చెప్పాడు. కానీ చాణక్య స్టోరీ కంటే సవ్యసాచి స్టోరీ నన్ను బాగా కదిలించింది. అందుకే ఇది చేస్తానని చెప్పాను. సవ్యసాచి హిట్ అయితే చందు మొండేటి దర్శకత్వంలో చాణక్య కూడా చేస్తాను.”

ఇలా తన నెక్ట్స్ ప్రాజెక్టుపై కూడా ఓ చిన్న క్లారిటీ ఇచ్చాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈ హీరో సమంత హీరోయిన్ గా మజిలీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాను డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకొస్తానంటున్నాడు. ఆ తర్వాత చాణక్య సినిమా గురించి ఆలోచిస్తానంటున్నాడు నాగచైతన్య.

Tags:    
Advertisement

Similar News