"సవ్యసాచి" సినిమా రివ్యూ

రివ్యూ:  సవ్యసాచి రేటింగ్‌: 2/5 తారాగణం: నాగ చైతన్య, నిధి అగర్వాల్, భూమిక, మాధవన్ తదితరులు సంగీతం:  కీరవాణి నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్ దర్శకత్వం: చందు మొండేటి గత కొంత కాలంగా సక్సెస్ లేక బాగా ఇబ్బంది పడుతున్న నాగ చైతన్యకు ఈ ఏడాది పెద్దగా అచ్చి రాలేదు. మాస్ ని మెప్పిస్తాననుకుని చాలా ఇష్టపడి చేసిన ”శైలజారెడ్డి అల్లుడు” తిరుగుటపా కట్టగా ఆశలన్నీ ”సవ్యసాచి” మీదే పెట్టుకున్నాడు. కార్తీకేయ, ప్రేమమ్ లాంటి చక్కని హిట్స్ తో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు చందు […]

Advertisement
Update:2018-11-02 10:28 IST

రివ్యూ: సవ్యసాచి
రేటింగ్‌: 2/5
తారాగణం: నాగ చైతన్య, నిధి అగర్వాల్, భూమిక, మాధవన్ తదితరులు
సంగీతం: కీరవాణి
నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్
దర్శకత్వం: చందు మొండేటి

గత కొంత కాలంగా సక్సెస్ లేక బాగా ఇబ్బంది పడుతున్న నాగ చైతన్యకు ఈ ఏడాది పెద్దగా అచ్చి రాలేదు. మాస్ ని మెప్పిస్తాననుకుని చాలా ఇష్టపడి చేసిన ”శైలజారెడ్డి అల్లుడు” తిరుగుటపా కట్టగా ఆశలన్నీ ”సవ్యసాచి” మీదే పెట్టుకున్నాడు.

కార్తీకేయ, ప్రేమమ్ లాంటి చక్కని హిట్స్ తో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు చందు మొండేటి దీనికి తోడవ్వడంతో అంచనాలు కూడా బాగానే మొదలయ్యాయి. మైత్రి మూవీ మేకర్స్ లాంటి సక్సెస్ ఫుల్ బ్యానర్, మాధవన్ లాంటి గ్లామరస్ విలన్ లాంటి పాజిటివ్స్ తో అంతా శుభంగానే కనిపించింది.

విక్రమ్ (నాగ చైతన్య) ఓ యాడ్ ఫిలిం మేకర్. కాలేజీలోనే తనకు చైత్ర (నిధి అగర్వాల్)తో ప్రేమాయణం ఉంటుంది. తల్లి గర్భంలో పౌష్టికాహార లోపం వల్ల విక్రమ్ మరో కవల ఆదిత్య కణాలు పంచుకుని ఒక్కడిగా పెరగడం వల్ల ఎడమ చేయి తన ఇష్టప్రకారం కాకుండా లోపల ఉన్న ఆదిత్య సూచనల మేరకు ప్రవర్తిస్తూ ఉంటుంది. చిన్న ఇబ్బందులు తప్ప లైఫ్ సాఫీగా గడిచిపోతున్న తరుణంలో విక్రమ్ బావను చంపి అక్క(భూమిక) కూతురిని కిడ్నాప్ చేయడం ద్వారా అతని జీవితంలోకి తుఫానులా వస్తాడు అరుణ్ (మాధవన్). ఇద్దరి మధ్య దోబూచులాట మొదలవుతుంది. చివరికి విక్రమ్ ఎలా గెలిచాడు అనేదే సవ్యసాచి కథ.

నాగ చైతన్య యాక్టర్ గా బాగా ఇంప్రూవ్ అవుతున్నాడు. నటనకు ఛాలెంజ్ విసిరే ఇలాంటి పాత్రలు మరిన్ని చేయడం ద్వారా నాగార్జున లాగా ఈ రోజు కాకపోయినా తనదైన సమయంలో మంచి హిట్ అయితే అందుకుంటాడు. ప్రేమ కథలో అల్లరి చేసే సీనియర్ గా…. సెకండ్ హాఫ్ లో అక్క కూతురి కోసం జాడ తెలియని విలన్ కోసం తాపత్రయ పడే పాత్రలో…. మంచి మార్కులు అందుకున్నాడు.

చైతు పరంగా పెద్ద లోపాలు ఏమి లేవు. హీరోయిన్ నిధి అగర్వాల్ చాలా యావరేజ్ గా ఉంది. విలన్ గా మాధవన్ అదరగొట్టాడు కానీ కేవలం సెకండ్ హాఫ్ లో ఉండే పాత్ర కాబట్టి ఎక్కువ ఆశించకపోవడం ఉత్తమం. భూమికది మాములు పాత్రే. కామెడీ బ్యాచ్ వెన్నెల కిషోర్, హైపర్ ఆది, సత్య తదితరులు నవ్వించేందుకు విశ్వప్రయత్నం చేసారు కానీ బలమైన డైలాగ్ లు లేకపోవడం వల్ల అంతగా వర్క్ అవుట్ కాలేదు.

దర్శకుడు చందు మొండేటి కథలో మెయిన్ పాయింట్ ని బాగా ఆలోచించాడు కానీ దీన్ని మెప్పించేలా తీయడంలో కావాల్సిన బిగి సడలని కథనాన్ని మాత్రం రాసుకోలేకపోయాడు. సన్నివేశాలన్నీ ఏదో క్లైమాక్స్ కు దారి తీయాలి కాబట్టి అన్నట్టు సాగుతుంటాయి కానీ ఎక్కడా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉండవు.

ఇంటర్వెల్ బ్లాక్ లో పాప చనిపోయిందని హీరో తెలుసుకున్న సీన్ కూడా చప్పగా అనిపించడానికి కారణం కథనంలో లోపమే. కథలోని అసలు మలుపుని ఇంటర్వెల్ దాకా చెప్పకపోవడం…. అక్కడి దాకా అనవసరం అనిపించే ప్రేమ కథతో…. టైం పాస్ చేయడం ఇదంతా సరైన కథ చేతిలో లేకపోవడమే.

ఎడమ చేయి మాట వినదని చెప్పించిన దర్శకుడు కేవలం దాన్ని కొన్ని సీన్లకే వాడుకుని మిగిలిన సమయంలో ఆ చేయికి ఏమి సంబంధం లేదు అనేలా చూపడం లాజిక్ కు దూరంగా ఉంది. పైగా సింక్ అవ్వని పాటలు, బలం లేని కామెడీ ట్రాక్ ఇవన్నీ మైనస్ లు గానే నిలిచాయి.

చందు మొండేటిలో మంచి టెక్నీషియన్ ఉన్నాడు. అందులో సందేహం లేదు. కానీ అదే స్థాయిలో కథకుడు కూడా ఉండి ఉంటే ఇదో మంచి థ్రిల్లర్ గా నిలిచిపోయేది. సవ్యసాచి ఆ అవకాశం ఇచ్చినా చందు వాడుకోలేదు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకే మెప్పిస్తారు. టైటిల్ ట్రాక్ తప్ప ఇంకేదీ తర్వాత గుర్తు కూడా ఉండదు. యువరాజ్ కెమెరా ఒక్కటే మెచ్చుకోదగింది. మైత్రి సంస్థ రాజీ పడినట్టు కనిపించదు.

చివరిగా చెప్పాలంటే ఎంత ఆశిస్తే అంత నిరాశ పరిచే సినిమా సవ్యసాచి. నాగ చైతన్య, మాధవన్ పెర్ఫార్మన్స్ లు పీక్స్ లో ఉన్నప్పటికీ వాళ్ళను పూర్తిగా ఉపయోగించుకునేలా కథా కథనాలు లేకపోవడంతో ఇదో మాములు మైండ్ గేమ్ మూవీగా మిగిలిపోయింది. ఓ మాదిరి టైం పాస్ తప్ప ఇంకే ప్రత్యేకతను సంతరించుకోలేక సవ్యసాచి కొన్ని విభాగాల్లో తప్ప మొత్తంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

సవ్యసాచి – రెండు చేతులూ ఎత్తేసాడు

Tags:    
Advertisement

Similar News