మరో ఘనత దక్కించుకున్న మహానటి
మహానటి సినిమా థియేటర్లలో ఎంత పెద్ద హిట్ అయిందో, విమర్శకుల నుంచి కూడా అదే స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కంటెంట్ ను, మేకింగ్ ను మెచ్చుకోని క్రిటిక్ లేడు. అలా అందరి ప్రశంసలు పొందిన ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ఇండియన్ పనోరమకు ఎంపికైంది మహానటి సినిమా. 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు త్వరలో గోవాలో జరగనున్నాయి. అందులో భాగంగా `మహానటి`ని ప్రదర్శిస్తారు. […]
మహానటి సినిమా థియేటర్లలో ఎంత పెద్ద హిట్ అయిందో, విమర్శకుల నుంచి కూడా అదే స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కంటెంట్ ను, మేకింగ్ ను మెచ్చుకోని క్రిటిక్ లేడు. అలా అందరి ప్రశంసలు పొందిన ఈ సినిమా ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ప్రతిష్టాత్మక ఇండియన్ పనోరమకు ఎంపికైంది మహానటి సినిమా.
49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు త్వరలో గోవాలో జరగనున్నాయి. అందులో భాగంగా 'మహానటి'ని ప్రదర్శిస్తారు. హిందీ, తమిళ, మలయాళం, తుళు… ఇలా భారతీయ భాషల నుంచి 22 చిత్రాలు నాన్-ఫీచర్ ఫిల్మ్స్ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకున్నాయి. మెయిన్ స్ట్రీమ్ లో మాత్రం భారతదేశం నుంచి నాలుగే చిత్రాల్ని ప్రదర్శనకు ఎంపిక చేశారు. అందులో దక్షిణాది నుంచి ఒక్క 'మహానటి'కే స్థానం దక్కింది.
కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కింది మహానటి.