రాములమ్మ సీటు మారుతారా? ఎన్నికల్లో పోటీ చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనే విషయం సస్పెన్స్‌గా మారింది. మొన్నటి వరకు ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. తెలంగాణ అంతటా తిరిగి ప్రచారం చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమెను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. మహబూబ్‌నగర్‌లో తొలి విడత ప్రచారంలో రాములమ్మ పాల్గొన్నారు. అయితే మొన్నటి దాకా పోటీకి దూరమని ప్రకటించిన విజయశాంతి… ఇప్పుడు మనసు […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా అనే విషయం సస్పెన్స్‌గా మారింది. మొన్నటి వరకు ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. తెలంగాణ అంతటా తిరిగి ప్రచారం చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఆమెను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. మహబూబ్‌నగర్‌లో తొలి విడత ప్రచారంలో రాములమ్మ పాల్గొన్నారు.
అయితే మొన్నటి దాకా పోటీకి దూరమని ప్రకటించిన విజయశాంతి… ఇప్పుడు మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో విజయశాంతి మెదక్ నియోజకవర్గంలో పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. పద్మా దేవేందర్ రెడ్డికి 89654 ఓట్లు వచ్చాయి, విజయశాంతికి 50054 ఓట్లు పడ్డాయి. దాదాపు 39వేలకు పైగా ఓట్ల తేడాతో విజయశాంతి పరాజయం పాలయ్యారు. అయితే ఈ సారి పరిస్థితులు మారాయి. కానీ విజయశాంతి మాత్రం మెదక్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
మెదక్ కలిసిరాకపోవడంతో నియోజకవర్గాన్ని మార్చాలని విజయశాంతి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇదే జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ఈ సీటు కోసం మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి రేసులో ఉన్నారు. తనకు లేకపోతే తన కొడుక్కి టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. నియోజకవర్గంపై ముత్యంరెడ్డికి మంచి పట్టుంది.
మరోవైపు దుబ్బాక సీటును కోదండరాం పార్టీ కూడా కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ నుంచి మాజీ జడ్పీటీసీ, టిఆర్ఎస్ మాజీ నేత చిందం రాజేందర్ టీజేఎస్ నుంచి పోటీకి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఇదే సీటును విజయశాంతి కోరుతున్నట్లు తెలుసుకున్న టీజేఎస్ నేతలు టెన్షన్‌లో పడ్డారు. తమ సీటుకు ఆమె ఎసరు పెట్టే సూచనలు కన్పిస్తున్నాయని వాపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్న చోట తెలంగాణ జన సమితి పూర్తిగా సపోర్ట్ చేయాలంటూ విజయశాంతి ప్రెస్‌నోట్ రిలీజ్ చేయడం ఈ వ్యూహంలో భాగమని గుసగుసలు విన్పిస్తున్నాయి.