పెళ్ళికి రెడీ అయిన "ఆర్ ఎక్స్ 100" హీరోయిన్
తెలుగులో వచ్చిన “ఆర్ ఎక్స్ 100” సినిమాతో యావత్ యువత ని తన వైపు తిప్పేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తరువాత పాయల్ కి తెలుగు లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే సోషల్ మీడియా లో పాయల్ పెళ్లి చేసుకోబోతుందంటూ పెళ్లి బట్టలలో ఉన్న ఒక ఫోటో చెక్కర్లు కొడుతుంది. పెళ్లి చేసుకొని నా భర్తతో హాయిగా ఉండాలని అనుకున్న అని చెప్పడంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ […]
తెలుగులో వచ్చిన “ఆర్ ఎక్స్ 100” సినిమాతో యావత్ యువత ని తన వైపు తిప్పేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తరువాత పాయల్ కి తెలుగు లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే సోషల్ మీడియా లో పాయల్ పెళ్లి చేసుకోబోతుందంటూ పెళ్లి బట్టలలో ఉన్న ఒక ఫోటో చెక్కర్లు కొడుతుంది. పెళ్లి చేసుకొని నా భర్తతో హాయిగా ఉండాలని అనుకున్న అని చెప్పడంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇప్పుడు పాయల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యూత్ మొత్తం కంగారు పడుతుంది. వారి ఆశల్ని నిరాశలు అయ్యాయని తెగ బాధపడిపోతున్నారు యువత. అభిమానుల ఆందోళనను చూసిన పాయల్ తాను నటిస్తున్న ఓ తమిళ సినిమాలో పెళ్లి సీన్ కోసం చేసిన షూటింగ్ లో భాగంగా ఆ ఫోటో లీక్ అయ్యిందని. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను ఇంకా ఎన్నో మంచి పాత్రలు చేయాలి… అలాగే ఎన్నో బాషల్లో సినిమాలు చెయ్యాలి అంటూ చెప్పుకొచ్చింది ఈ భామ.