రకుల్ అందుకే రామ్ చరణ్ కి నో చెప్పిందట!

చిన్న సినిమాలతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోస్ సరసన అవకాశాలు దక్కించుకుంటుంది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ఇటివలే బాలకృష్ణ సరసన “ఎన్టీఆర్” బయోపిక్ లో నటించింది. ఈ సినిమాలో అలనాటి నటి శ్రీదేవి పాత్రలో రకుల్ నటించింది. “ఎన్టీఆర్” సినిమాలో చిన్న పాత్రను చేసేందుకు ఓకే చెప్పిన రకుల్ తాజాగా రామ్ చరణ్ నుంచి వచ్చిన ఆఫర్ ను కాదని అందరికి షాక్ ఇచ్చింది. బోయాపాటి శ్రీను, రామ్ […]

Advertisement
Update:2018-10-29 09:37 IST

చిన్న సినిమాలతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోస్ సరసన అవకాశాలు దక్కించుకుంటుంది స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ఇటివలే బాలకృష్ణ సరసన “ఎన్టీఆర్” బయోపిక్ లో నటించింది. ఈ సినిమాలో అలనాటి నటి శ్రీదేవి పాత్రలో రకుల్ నటించింది. “ఎన్టీఆర్” సినిమాలో చిన్న పాత్రను చేసేందుకు ఓకే చెప్పిన రకుల్ తాజాగా రామ్ చరణ్ నుంచి వచ్చిన ఆఫర్ ను కాదని అందరికి షాక్ ఇచ్చింది.

బోయాపాటి శ్రీను, రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాలో రకుల్ తో ఐటెం సాంగ్ చేసేందుకు ప్రయత్నించారట. చరణ్ తో రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రకుల్ కు ఇది మంచి అవకాశం. కానీ ఆమె ఐటెం సాంగ్ కు నో చెప్పింది. “ఎన్టీఆర్” సినిమా కోసం కోటి పారితోషికం దక్కించుకున్న రకుల్, ఈ సినిమా కోసం కూడా అంత పారితోషికం డిమాండ్ చేసిందని, అందుకే బోయపాటి శ్రీను రకుల్ స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ పై ద్రుష్టి పెట్టాడు అని తెలుస్తుంది. కేవలం రెమ్యునరేషన్ తక్కువ ఇస్తున్నారు అని చెప్పి రకుల్ ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు అని చాలా మంది అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News