నిర్మాతలతో తెలివిగా వ్యవహరిస్తున్న రష్మిక

“ఛలో” “గీత గోవిందం” “దేవదాస్” సినిమాలతో హిట్ కొట్టి తనకంటూ ఒక ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది హీరోయిన్ రష్మిక. అయితే ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు అందుకుంటున్న తరుణంలో ఆమె శాండిల్ వుడను దూరం పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.ఇక తెలుగు హీరోయిన్ కి ఒక బ్లాక్ బస్టర్ వస్తే రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేస్తారు. కానీ రష్మిక మాత్రం ఇక్కడ చాలా తెలివిగా ఆలోచిస్తుంది అని చెపోచ్చు. ఎందుకంటే రెమ్యునరేషన్ పెంచేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన […]

Advertisement
Update:2018-10-29 06:12 IST

“ఛలో” “గీత గోవిందం” “దేవదాస్” సినిమాలతో హిట్ కొట్టి తనకంటూ ఒక ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది హీరోయిన్ రష్మిక. అయితే ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు అందుకుంటున్న తరుణంలో ఆమె శాండిల్ వుడను దూరం పెట్టిందనే వార్తలు వస్తున్నాయి.ఇక తెలుగు హీరోయిన్ కి ఒక బ్లాక్
బస్టర్ వస్తే రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేస్తారు.

కానీ రష్మిక మాత్రం ఇక్కడ చాలా తెలివిగా ఆలోచిస్తుంది అని చెపోచ్చు. ఎందుకంటే రెమ్యునరేషన్ పెంచేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన ఈ అమ్మడు నాలుగైదు సినిమాల వరకు ప్రస్తుతం తీసుకుంటున్న 50 లక్షల పారితోషికం కొనసాగించాలనే ఆలోచనలో ఉందట. మరోవైపు కోరుకున్న ప్రియుడితో ఎంగేజ్మెంట్ జరిగి ఆపై బ్రేకప్ అయ్యింది. ఈ సమయంలో సొమ్ముకంటే పరిశ్రమలో నిలదొక్కుకోవడం ముఖ్యమని రష్మిక భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఇలా రెమ్యునరేషన్ తగ్గించేసి నిర్మాతకి ఫేవర్ గా ఉంటూ నిర్మాత దగ్గర మంచి పేరు కొట్టేయాలి అని రష్మిక ప్లాన్. రష్మిక గత చిత్రాల నిర్మాతలకి కూడా రష్మిక అంటే చాలా ఇష్టం… ఎందుకంటే ఆ సినిమాల సమయంలో కూడా రష్మిక ఎవర్ని ఇబ్బంది పెట్టలేదట.

Tags:    
Advertisement

Similar News