నాకు బాక్సింగ్ వచ్చు.. కాస్టింగ్ కౌచ్ పై నిధి అగర్వాల్

కాస్టింగ్ కౌచ్ పై ఒక్కో హీరోయిన్ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతోంది. తాజాగా ఇదే ప్రశ్న హీరోయిన్ నిధి అగర్వాల్ కు కూడా ఎదురైంది. సవ్యసాచి సినిమాతో తెలుగుతెరకు పరిచయమౌతున్న ఈ ముద్దుగుమ్మ.. కాస్టింగ్ కౌచ్ పై కాస్త వెరైటీగా రియాక్ట్ అయింది. తనకు బాక్సింగ్ వచ్చు అంటోంది ఈ బ్యూటీ. కెరీర్ లో ఇప్పటివరకు తన వద్ద ఎవ్వరూ సెక్సువల్ ప్రపోజల్స్ తీసుకురాలేదని, సెట్స్ లో ఎవరూ తనతో అనుచితంగా ప్రవర్తించలేదని అంటోంది నిధి అగర్వాల్. […]

Advertisement
Update:2018-10-29 12:22 IST

కాస్టింగ్ కౌచ్ పై ఒక్కో హీరోయిన్ ఒక్కో విధంగా రియాక్ట్ అవుతోంది. తాజాగా ఇదే ప్రశ్న హీరోయిన్ నిధి అగర్వాల్ కు కూడా ఎదురైంది. సవ్యసాచి సినిమాతో తెలుగుతెరకు పరిచయమౌతున్న ఈ ముద్దుగుమ్మ.. కాస్టింగ్ కౌచ్ పై కాస్త వెరైటీగా రియాక్ట్ అయింది. తనకు బాక్సింగ్ వచ్చు అంటోంది ఈ బ్యూటీ.

కెరీర్ లో ఇప్పటివరకు తన వద్ద ఎవ్వరూ సెక్సువల్ ప్రపోజల్స్ తీసుకురాలేదని, సెట్స్ లో ఎవరూ తనతో అనుచితంగా ప్రవర్తించలేదని అంటోంది నిధి అగర్వాల్. ఒకవేళ ఎవరైనా అలా తనతో మిస్-బిహేవ్ చేస్తే తనకు బాక్సింగ్ వచ్చని, పిడిగుద్దులతో చంపేస్తానని అంటోంది.

కేవలం బాక్సింగ్ మాత్రమే కాకుండా, తనకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రవేశం ఉందని, కాస్టింగ్ కౌచ్ ఘటనలు జరగకుండా తనను తాను రక్షించుకోవడం బాగా తెలుసంటోంది. వీటితో పాటు ఇనస్టాగ్రామ్ లో తను చాలా యాక్టివ్ గా ఉంటానని, తనకు అలాంటి చేదు అనుభవాలు ఎదురైన మరుక్షణం ఇనస్టాగ్రామ్ లో పెట్టి, అవతలి వ్యక్తి పరువు బజారుకీడుస్తానని శెలవిచ్చింది. హీరోయిన్లంతా నిధి అగర్వాల్ లా ఉంటే మంచిదేమో..! ఇంతకీ ఈమె నిజమే చెబుతోందా..!

Tags:    
Advertisement

Similar News