డీఎస్‌తో పాటు ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్‌లో చేరుతారా?
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లోకి మళ్లీ చేరికలు ఊపందుకున్నాయి. రాహుల్ సభ టైమ్‌లోనే పార్టీలోకి వలసలు ఉంటాయని నమ్మారు. కానీ ఇద్దరు ముగ్గురు నియోజకవర్గ నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈ సారి సీనియర్ నేతలతో పాటు కీలక టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం కన్పిస్తోంది. టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్ […]
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్‌లోకి మళ్లీ చేరికలు ఊపందుకున్నాయి. రాహుల్ సభ టైమ్‌లోనే పార్టీలోకి వలసలు ఉంటాయని నమ్మారు. కానీ ఇద్దరు ముగ్గురు నియోజకవర్గ నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఈ సారి సీనియర్ నేతలతో పాటు కీలక టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరే అవకాశం కన్పిస్తోంది.
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. శనివారం ఉదయం 10 గంటలకు ఆయన రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. డీఎస్‌తో పాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు కాంగ్రెస్ లో చేరనున్నారు. రాములు నాయక్, నర్సారెడ్డిలను ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది.
అయితే ఈ టీఆర్ఎస్ నేతలే కాకుండా… బీసీ సంఘం నేత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఆయతో సీనియర్ నేతలు జానారెడ్డితో పాటు పలువురు చర్చించారు. రంగారెడ్డి జిల్లాలో ఒక నియోజకవర్గం తనకు ఇవ్వాలని ఆయన కోరారని తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ నేతలు ఒకే చెప్పినట్లు సమాచారం.
ఈ చర్చలు ఫలప్రదమైతే డీఎస్‌తో పాటు ఆర్.కృష్ణయ్య కూడా కాంగ్రెస్‌లో చేరే చాన్స్ ఉంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమ కూడా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని అంటున్నారు. వేములవాడ సీటుపై హామీ ఇస్తే ఆమె కూడా కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే చాన్స్ ఉంది. అన్నీ కుదిరితే ఆమె కూడా ఇవాళే హస్తం గూటికి చేరవచ్చనేది టాక్. ఒకవేళ కాంగ్రెస్‌లో చాన్స్ రాకపోతే బీజేపీ టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆమె మాత్రం కేసీఆర్ హామీ కోసం ఎదురుచూస్తున్నట్లు బయటకు చెబుతున్నారు.