సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావు

సీబీఐలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐలో అవినీతి, లంచాల వ్యవహారంతో ఉన్నతాధికారులు రోడ్డునపడ్డ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌పై వేటు వేశారు. అలోక్‌ వర్మను తొలగించారు. సీబీఐ తాత్కలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వర రావును నియమించారు. ఈయన తెలుగు వారు. వరంగల్ జిల్లా బోరె నర్సాపూర్ స్వస్థలం. 1986 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్ అధికారి. గతంలో ఒడిషా డీజీపీగా కూడా నాగేశ్వరరావు పనిచేశారు. విజయరామారావు తర్వాత సీబీఐ డైరెక్టర్‌గా వచ్చిన మరో […]

Advertisement
Update:2018-10-24 02:11 IST

సీబీఐలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐలో అవినీతి, లంచాల వ్యవహారంతో ఉన్నతాధికారులు రోడ్డునపడ్డ నేపథ్యంలో ప్రధాని మోడీ ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌పై వేటు వేశారు. అలోక్‌ వర్మను తొలగించారు.

సీబీఐ తాత్కలిక డైరెక్టర్‌గా మన్నెం నాగేశ్వర రావును నియమించారు. ఈయన తెలుగు వారు. వరంగల్ జిల్లా బోరె నర్సాపూర్ స్వస్థలం. 1986 బ్యాచ్‌కు చెందిన నాగేశ్వరరావు ఒడిశా కేడర్ అధికారి. గతంలో ఒడిషా డీజీపీగా కూడా నాగేశ్వరరావు పనిచేశారు.

విజయరామారావు తర్వాత సీబీఐ డైరెక్టర్‌గా వచ్చిన మరో తెలుగు అధికారి నాగేశ్వరరావే. సీబీఐలో సంక్షోభం పై అర్థరాత్రి వరకు ఉన్నతాధికారులతో చర్చలు జరిపిన ప్రధాని మోడీ…. చివరకు మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు.

Tags:    
Advertisement

Similar News