ఆటుపోట్ల మధ్య కొనసాగుతున్న అరవింద

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా నుంచి మరో పోస్టర్ వచ్చింది. ఈసారి 150 కోట్ల రూపాయలతో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అవును.. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు యూనిట్ ప్రకటించింది. అదే ఈ పోస్టర్. అరవింద సమేత కలెక్షన్లపై చాలా అనుమానాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ఏరియాల్లో వసూళ్లు పెంచి చెబుతున్నారని, రికార్డుల కోసం కావాలనే నంబర్లు ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ విమర్శలు చెలరేగాయి. వీటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ […]

Advertisement
Update:2018-10-22 18:38 IST

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా నుంచి మరో పోస్టర్ వచ్చింది. ఈసారి 150 కోట్ల రూపాయలతో పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అవును.. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు యూనిట్ ప్రకటించింది. అదే ఈ పోస్టర్.

అరవింద సమేత కలెక్షన్లపై చాలా అనుమానాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా ఏరియాల్లో వసూళ్లు పెంచి చెబుతున్నారని, రికార్డుల కోసం కావాలనే నంబర్లు ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ విమర్శలు చెలరేగాయి. వీటికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దీటుగానే సమాధానం చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోజుకు 2 అదనపు ప్రదర్శనలకు ప్రత్యేక అనుమతి తెచ్చుకున్నామని, మరోవైపు టిక్కెట్ రేట్లను కూడా పెంచడం వల్ల వసూళ్లు బాగా వచ్చాయని అంటున్నారు. అటు తెలంగాణలో కూడా తారక్ కెరీర్ లోనే అత్యధికంగా 3వందలకు పైగా థియేటర్లలో విడుదల చేయడం వల్ల నైజాం వసూళ్లు బాగున్నాయని వాదిస్తున్నారు.

వీళ్ల వాదనల మధ్య అరవింద సమేత సినిమా రెండో వారంలో నడుస్తోంది. ఎల్లుండి నుంచి మూడో వారంలోకి అడుగుపెట్టబోతోంది. నిన్నటితో 11 రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. నైజాంలో బ్రేక్-ఈవెన్ సాధించినట్టు మేకర్స్ చెబుతున్నారు. 18 కోట్ల రూపాయలకు నైజాం రైట్స్ కొంటే.. నిన్నటి షేర్ తో కలుపుకొని 20 కోట్ల 13 లక్షల రూపాయలు వచ్చినట్టు చెబుతున్నారు.

అటు ఓవర్సీస్ లో అరవింద సమేత సినిమా 2 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. నిన్నటి నెట్ తో కలుపుకొని ఈ సినిమాకు 2.08 మిలియన్ డాలర్ వసూళ్లు వచ్చాయి. మరో 10 రోజుల్లో అరవింద సమేత నుంచి 200 కోట్ల రూపాయల పోస్టర్ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు విమర్శకులు.

Tags:    
Advertisement

Similar News