కిషన్‌కు ఎర్త్ పెట్టిన పరిపూర్ణనంద!
బీజేపీలో రాజకీయాలు మారుతున్నాయి. కొత్త కొత్త వాళ్ల ఎంట్రీతో పాత వాళ్ల ఆశలు గండిపడుతున్నాయి. బీజేపీ అసెంబ్లీ జాబితా విడుదలైంది. ఐదుగురు సిట్టింగ్‌లతో పాటు గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వారికి టికెట్లు కేటాయించారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. ఇటీవలే పార్టీలోకి పరిపూర్ణానంద చేరారు. అమిత్‌షా సమక్షంలో కండువా కప్పుకున్నారు. అక్కడ రాష్ట్ర నేతలెవరూ లేరు. కనీసం కండువా కప్పే కార్యక్రమానికి ఎవరినీ పిలవలేదు. రాం మాధవ్, అమిత్ షా సమక్షంలో ఇదంతా జరిగిపోయింది, […]
బీజేపీలో రాజకీయాలు మారుతున్నాయి. కొత్త కొత్త వాళ్ల ఎంట్రీతో పాత వాళ్ల ఆశలు గండిపడుతున్నాయి. బీజేపీ అసెంబ్లీ జాబితా విడుదలైంది. ఐదుగురు సిట్టింగ్‌లతో పాటు గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వారికి టికెట్లు కేటాయించారు. ఇక్కడ వరకూ బాగానే ఉంది. ఇటీవలే పార్టీలోకి పరిపూర్ణానంద చేరారు. అమిత్‌షా సమక్షంలో కండువా కప్పుకున్నారు. అక్కడ రాష్ట్ర నేతలెవరూ లేరు. కనీసం కండువా కప్పే కార్యక్రమానికి ఎవరినీ పిలవలేదు. రాం మాధవ్, అమిత్ షా సమక్షంలో ఇదంతా జరిగిపోయింది,
పరిపూర్ణానంద ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఆయన అసెంబ్లీకి వెళతారా? లేక ఎంపీగా పోటీ చేస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. జూబ్లిహిల్స్ నుంచి లేదా బీజేపీకి పట్టున్న మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అని వార్తలు వచ్చాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏదో ఒక నియోకవర్గం నుంచి ఆయన బరిలో ఉంటారని మరికొన్ని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే పరిపూర్ణానంద సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన అసెంబ్లీ బరిలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
పరిపూర్ణానంద లోక్‌సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంటున్నారు. లేకపోతే కరీంనగర్ లోక్‌సభ బరిలో ఉంటారని మరికొందరి అంచనా. అయితే ఈ రెండు స్థానాలపై బీజేపీ ముఖ్య నేతలు కన్నేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తే… లోక్‌సభ బరిలో నిలవాలని ఇద్దరు నేతలు అనుకుంటున్నారు. సికింద్రాబాద్ నుంచి ఈ సారి గెలిచి కేంద్ర మంత్రి కావాలని కిషన్‌రెడ్డి కలలు కంటున్నారు. కరీంనగర్‌పై మురళీధర్‌రావు కన్నేశారు. ఆయన కూడా కేంద్ర మంత్రి కావాలనే ప్లాన్‌లో ఉన్నారు. కానీ వీరిద్దరికి పరిపూర్ణానంద చెక్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరీ ఈ రెండు కీలక సీట్లు వచ్చే ఎన్నికల్లో ఎవరికీ లభిస్తాయో చూడాలి.