మహేష్ ఇలాంటి కథలు ఒప్పుకుంటాడా..?

సినిమా ఏ జానర్ కు చెందినదైనా అందులో తను మాత్రం అందంగా కనిపించాలి. మహేష్ నుంచి తప్పనిసరి కండిషన్ ఇది. అందుకే అతడి సినిమాల్లో పెద్దగా మేకోవర్లు ఉండవు. ప్రతి సినిమాలో దాదాపు ఒకేలా కనిపిస్తాడు ఈ హీరో. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హీరోను 1930ల నాటి కథలోని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు సుకుమార్. అవును.. మహేష్ కోసం సుకుమార్ ఓ పీరియాడిక్ డ్రామా స్టోరీ రాస్తున్నాడు. రంగస్థలం సినిమాను 1980ల నాటి బ్యాక్ డ్రాప్ […]

Advertisement
Update: 2018-10-20 04:29 GMT

సినిమా ఏ జానర్ కు చెందినదైనా అందులో తను మాత్రం అందంగా కనిపించాలి. మహేష్ నుంచి తప్పనిసరి కండిషన్ ఇది. అందుకే అతడి సినిమాల్లో పెద్దగా మేకోవర్లు ఉండవు. ప్రతి సినిమాలో దాదాపు ఒకేలా కనిపిస్తాడు ఈ హీరో. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న హీరోను 1930ల నాటి కథలోని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు సుకుమార్.

అవును.. మహేష్ కోసం సుకుమార్ ఓ పీరియాడిక్ డ్రామా స్టోరీ రాస్తున్నాడు. రంగస్థలం సినిమాను 1980ల నాటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన సుక్కూ, ఈసారి మహేష్ కోసం ఏకంగా 1930ల నాటి కాలానికి షిఫ్ట్ అయ్యాడు. తన అసిస్టెంట్స్ తో కలిసి కథకు ఓ రూపు తీసుకొచ్చాడు. కానీ మహేష్ కు ఇంకా వినిపించలేదు.

ప్రస్తుతం న్యూయార్క్ లో మహర్షి సినిమా షూటింగ్ లో ఉన్నాడు మహేష్. మరో 15 రోజులు ఈ షెడ్యూల్ ఉంటుంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత సుకుమార్ స్టోరీని వింటాడు. ఇప్పటికే సుకుమార్ చెప్పిన ఓ స్టోరీని మహేష్ తిరస్కరించాడు. మరి ఈ స్టోరీకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది చూడాలి.

Tags:    
Advertisement

Similar News