జాతీయ వన్డే క్రికెట్ విజేత ముంబై

విజయ్ హజారే ట్రోఫీని అందుకొన్న ముంబై ఫైనల్లో ఢిల్లీ పై ముంబై 4 వికెట్ల విజయం ఢిల్లీ 177 ఆలౌట్, ముంబై 6 వికెట్లకు 180 పరుగులు జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే… విజయ్ హజారే ట్రోఫీని ముంబై గెలుచుకొంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన లోస్కోరింగ్ ఫైనల్లో ముంబై 4 వికెట్లతో ఢిల్లీని అధిగమించింది. ఈ టైటిల్ సమరంలో… టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు 45.4 ఓవర్లలో 177 […]

Advertisement
Update:2018-10-20 11:32 IST
  • విజయ్ హజారే ట్రోఫీని అందుకొన్న ముంబై
  • ఫైనల్లో ఢిల్లీ పై ముంబై 4 వికెట్ల విజయం
  • ఢిల్లీ 177 ఆలౌట్, ముంబై 6 వికెట్లకు 180 పరుగులు

జాతీయ వన్డే క్రికెట్ చాంపియన్లకు ఇచ్చే… విజయ్ హజారే ట్రోఫీని ముంబై గెలుచుకొంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ముగిసిన లోస్కోరింగ్ ఫైనల్లో ముంబై 4 వికెట్లతో ఢిల్లీని అధిగమించింది. ఈ టైటిల్ సమరంలో… టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ జట్టు 45.4 ఓవర్లలో 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. సమాధానంగా… ట్రోఫీ నెగ్గాలంటే 50 ఓవర్లలో 178 పరుగులు చేయాల్సిన ముంబై… కేవలం 35 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులతో విజేతగా నిలిచింది.

వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఆదిత్య తారే 71, సిద్దేశ్ లాడ్ 48 పరుగుల స్కోర్లతో 5వ వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో.. తమజట్టుకు విజయం ఖాయం చేశారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని ముంబైజట్టు… విజయ్ హజారే ట్రోఫీతో ప్రస్తుత సీజన్లో తన టైటిళ్ల వేటను ప్రారంభించింది.

Tags:    
Advertisement

Similar News