అరవింద సమేత మొదటి వారం ఓకేనా?

కొంతమంది సూపర్ హిట్ అన్నారు. మరికొందరు సినిమా బాగా లేదన్నారు. ఇంకొందరు వంద కోట్ల సినిమా అన్నారు. ఇలా పాజిటివ్-నెగెటివ్ రివ్యూల మధ్య వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం. విడుదలై 7 రోజులు గడిచినా, ఆశ్చర్యకరంగా ఈ సినిమాపై ఇప్పటికీ అదే మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. కాకపోతే దసరా సీజన్ కావడం, ముందుగానే థియేటర్లను దండిగా బుక్ చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో అదనపు షోల కోసం ప్రత్యేక అనుమతి […]

Advertisement
Update:2018-10-18 12:05 IST

కొంతమంది సూపర్ హిట్ అన్నారు. మరికొందరు సినిమా బాగా లేదన్నారు. ఇంకొందరు వంద కోట్ల సినిమా అన్నారు. ఇలా పాజిటివ్-నెగెటివ్ రివ్యూల మధ్య వారం రోజుల రన్ పూర్తిచేసుకుంది ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం. విడుదలై 7 రోజులు గడిచినా, ఆశ్చర్యకరంగా ఈ సినిమాపై ఇప్పటికీ అదే మిక్స్ డ్ టాక్ నడుస్తోంది. కాకపోతే దసరా సీజన్ కావడం, ముందుగానే థియేటర్లను దండిగా బుక్ చేసుకోవడం, ఆంధ్రప్రదేశ్ లో అదనపు షోల కోసం ప్రత్యేక అనుమతి తెచ్చుకోవడంతో ఈ సినిమా వసూళ్లు పడిపోలేదు.

అయినప్పటికీ కలెక్షన్లను మార్చి చెబుతున్నారనే విమర్శల్ని ఎదుర్కొంటోంది అరవింద సమేత.

ఇక వసూళ్ల విషయానికొస్తే ఈ వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది అరవింద సమేత సినిమా. గ్రాస్ పరంగా చూస్తే వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 111 కోట్ల రూపాయలు వచ్చినట్టు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 58 కోట్ల 48 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత చిత్రానికి వారం రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 16.63 కోట్లు
సీడెడ్ – రూ. 13.49 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 6.57 కోట్లు
ఈస్ట్ – రూ. 4.68 కోట్లు
వెస్ట్ – రూ. 3.92 కోట్లు
గుంటూరు – రూ. 6.84 కోట్లు
కృష్ణా – రూ. 4.16 కోట్లు
నెల్లూరు – రూ. 2.16 కోట్లు

Tags:    
Advertisement

Similar News