మళ్లీ బిజీ అయిన నాని
ఈమధ్య కాలంలో దాదాపు 3 నెలల పాటు విరామం లేకుండా పనిచేశాడు నాని. ఓవైపు బిగ్ బాస్ సీజన్-2 రియాలిటీ షో నడిపిస్తూనే, మరోవైపు నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమా చేశాడు. అలా వంద రోజుల పాటు ఆదివారాలు కూడా రెస్ట్ తీసుకోకుండా నాన్-స్టాప్ గా పనిచేసిన నాని, దేవదాస్ రిలీజ్ తర్వాత వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోతున్నాడు. నాని హీరోగా జెర్సీ సినిమా ఈరోజు లాంఛ్ అయింది. ఇదేదో […]
ఈమధ్య కాలంలో దాదాపు 3 నెలల పాటు విరామం లేకుండా పనిచేశాడు నాని. ఓవైపు బిగ్ బాస్ సీజన్-2 రియాలిటీ షో నడిపిస్తూనే, మరోవైపు నాగార్జునతో కలిసి దేవదాస్ సినిమా చేశాడు. అలా వంద రోజుల పాటు ఆదివారాలు కూడా రెస్ట్ తీసుకోకుండా నాన్-స్టాప్ గా పనిచేసిన నాని, దేవదాస్ రిలీజ్ తర్వాత వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోతున్నాడు.
నాని హీరోగా జెర్సీ సినిమా ఈరోజు లాంఛ్ అయింది. ఇదేదో కొబ్బరికాయ కొట్టేసి ఇంటికెళ్లిపోయే వ్యవహారం కాదు. రేపట్నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుకాబోతోంది. అలాఅని రెగ్యులర్ సినిమాల్లా యాక్షన్-కట్ చెప్పి వెళ్లిపోయే సినిమా కూడా కాదు. బాగా కష్టపడాల్సిన సినిమా.
ఎందుకంటే ఈ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ గా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర కోసం ఇప్పటికే క్రికెట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ఆ ప్రాక్టీస్ ను అలా కొనసాగిస్తూనే, మరోవైపు షూటింగ్ కూడా చేయాలన్నమాట. ఈ పాత్ర కోసం కాస్త గడ్డం పెంచిన నాని, సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ రాబోతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ క్లాప్ కొట్టాడు. ఈ మూవీతో కన్నడ బ్యూటీ శ్రద్ధశ్రీనాధ్ తెలుగుతెరకు పరిచయమౌతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్ ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు.