మళ్లీ గెలవాలంటే పాదయాత్రలే శరణ్యమంటున్న మహారాష్ట్ర బీజేపీ

వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడానికి పాదయాత్రలు మినహా మరో దారి లేదని మహారాష్ట్ర బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ‘సంపర్క్‌ అభియాన్‌’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు కనీసం 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ పాదయాత్రలో ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలను తెలుసుకుని భరోసా ఇవ్వడం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అభ్యర్థికి నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడానికి వీలవుతుందిని, మరోవైపు పార్టీకి మద్దతు పెరుగుతుందని పార్టీ భావిస్తోంది. మహారాష్ట్రలోని 121 మంది బీజేపీ […]

Advertisement
Update:2018-10-17 06:30 IST

వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడానికి పాదయాత్రలు మినహా మరో దారి లేదని మహారాష్ట్ర బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం ‘సంపర్క్‌ అభియాన్‌’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు కనీసం 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయాల్సి ఉంటుంది. ఈ పాదయాత్రలో ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలను తెలుసుకుని భరోసా ఇవ్వడం చేయాల్సి ఉంటుంది.

దీనివల్ల అభ్యర్థికి నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకోవడానికి వీలవుతుందిని, మరోవైపు పార్టీకి మద్దతు పెరుగుతుందని పార్టీ భావిస్తోంది. మహారాష్ట్రలోని 121 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవల ఒక ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 121కి చేరింది.

మహాత్మాగాంధీ వర్థంతి రోజైన జనవరి 30 నాటికల్లా ఈ పాదయాత్రలు పూర్తికావాలని పార్టీ ఆదేశించింది. అంతేకాదు పాదయాత్రలతో పాటు పార్టీ మరో కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో రోజుకు ఒక గంట సేపు శ్రమదానం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యేతో పాటు ఎంపిక చేసిన 150 మంది కార్యకర్తలు ఈ పాదయాత్రలోనూ, శ్రమదానం కార్యక్రమంలోనూ పాల్గొంటారు.

Tags:    
Advertisement

Similar News