జెమినీ చేతికి చిక్కిన మహర్షి
మహేష్ బాబు, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మహర్షి సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న విషయాన్ని జెమినీ ఛానెల్ అధికారికంగా ప్రకటించింది. మహేష్ బాబుకు ఇది చాలా ప్రతిష్టాత్మక చిత్రం. ఎందుకంటే ఇది మహేష్ కెరీర్ లో 25వ సినిమా కాబట్టి. అందుకే ఏరికోరి, చాన్నాళ్లు వెయిట్ చేయించి […]
Advertisement
మహేష్ బాబు, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మహర్షి సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 27 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న విషయాన్ని జెమినీ ఛానెల్ అధికారికంగా ప్రకటించింది.
మహేష్ బాబుకు ఇది చాలా ప్రతిష్టాత్మక చిత్రం. ఎందుకంటే ఇది మహేష్ కెరీర్ లో 25వ సినిమా కాబట్టి. అందుకే ఏరికోరి, చాన్నాళ్లు వెయిట్ చేయించి మరీ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమాలో నటిస్తున్నాడు మహేష్. ఈ సినిమాను ఏకంగా ముగ్గురు ప్రొడ్యూసర్లు నిర్మిస్తున్నారు. వాళ్లే దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ. నిర్మాణపరంగా మేజర్ షేర్ మాత్రం దిల్ రాజుదే. రెండోస్థానంలో అశ్వనీదత్, మూడో స్థానంలో పీవీపీ ఉన్నారు.
కేవలం లాభాలు మాత్రమే కాకుండా.. శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా వీళ్లు ముగ్గురూ వాటాలవారీగా షేర్ చేసుకుంటారు. దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది మహర్షి సినిమా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Advertisement