పవన్, చంద్రబాబు.... మధ్యలో లింగమనేని....
పవన్ కల్యాణ్ ఒకవైపు చంద్రబాబు నాయుడును అయితే విమర్శిస్తూనే ఉన్నాడు కానీ.. ఈయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో చెప్పడం కష్టం. పైకేతే ఇలా అర్థం కానట్టుగా కనిపిస్తున్నా లోలోన మాత్రం పవన్ కల్యాణ్ ఏదో వ్యూహంతోనే వెళ్తున్నాడు అని మాత్రం ఖరారు చేసుకోవచ్చు. పవన్ చుట్టూ ఉండే మనుషులే ఇందుకు సంబంధించి క్లూ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ సన్నిహిత వర్గాల్లో చంద్రబాబు సన్నిహితులు ఉన్నారంటే ఇది ఎంత విడ్డూరమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. నమ్మడానికి విచిత్రంగా అనిపించినా…. […]
పవన్ కల్యాణ్ ఒకవైపు చంద్రబాబు నాయుడును అయితే విమర్శిస్తూనే ఉన్నాడు కానీ.. ఈయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాడో చెప్పడం కష్టం. పైకేతే ఇలా అర్థం కానట్టుగా కనిపిస్తున్నా లోలోన మాత్రం పవన్ కల్యాణ్ ఏదో వ్యూహంతోనే వెళ్తున్నాడు అని మాత్రం ఖరారు చేసుకోవచ్చు. పవన్ చుట్టూ ఉండే మనుషులే ఇందుకు సంబంధించి క్లూ ఇస్తున్నారు. పవన్ కల్యాణ్ సన్నిహిత వర్గాల్లో చంద్రబాబు సన్నిహితులు ఉన్నారంటే ఇది ఎంత విడ్డూరమైన విషయమో అర్థం చేసుకోవచ్చు.
నమ్మడానికి విచిత్రంగా అనిపించినా…. ఇది నిజం. పవన్ కల్యాణ్ సన్నిహిత వర్గాల్లో చంద్రబాబు సన్నిహితులు కనిపిస్తున్నారు. ఈ జాబితాలో మొదట వినిపిస్తున్న పేరు లింగమనేని రమేష్. ఈయన చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. ఎంత సన్నిహితుడు అంటే.. సుజనా చౌదరి, సీఎం రమేశ్, మురళీ మోహన్ లు బాబు కు ఏ విధంగా బినామీలు అనిపించుకున్నారో.. అంతే స్థాయి సన్నిహితుడు లింగమనేని. సుజనా, సీఎం, మురళీ మోహన్ ల సామ్రాజ్యాలు హైదరాబాద్ వి అయితే విజయవాడ ఏరియాలో బాబుకు లింగమనేని అన్నమాట. ఇదీ కథ.
ఇలాంటి లింగమనేని రమేశ్ ఇప్పుడు పవన్ కల్యాణ్ తో అత్యంత సన్నిహితంగా మెలుగుతూ ఉన్నాడు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. గతంలో తెలుగుదేశం పార్టీతో పవన్ కల్యాణ్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు ఎలా అయితే లింగమనేని పవన్ తో బంధాన్ని నెరిపాడో ఇప్పుడు కూడా అదే విధంగా బంధం కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఎటు వెళ్లినా లింగమనేని కూడా కనిపిస్తూ ఉన్నాడు.
ఇది వరకు విజయవాడ ప్రాంతంలో పవన్ కల్యాణ్ సొంతింటి కోసం భూమి కొన్న వ్యవహారంలో కూడా లింగమనేని పేరు గట్టిగా వినిపించింది. మార్కెట్ రేటు కన్నా అతి తక్కువ ధరకే లింగమనేని పవన్ కల్యాణ్ కు భూమిని అమ్మాడని వార్తలు వచ్చాయి. అప్పుడే కాదు…. ఇప్పుడూ పవన్ తో లింగమనేని చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండటం…. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు గల రహస్య అవగాహనకు నిదర్శం ఇదేనని విశ్లేషకులు అంటున్నారు.