ముందే ఊహించాం... ఎలుకను కూడా పట్టుకోలేరు " సీఎం రమేష్
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తున్నందుకే తనపై ఐటీ దాడులు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. కడప ఉక్కుపై కేంద్రమంత్రిని తాను నిలదీశానని దాంతో ఇలా దాడులు చేయిస్తున్నారన్నారు. అయినా సరే తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. తానేమీ స్మగ్లర్‌ను కాదన్నారు సీఎం రమేష్. కేవలం టీడీపీ నాయకులపైనే ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో ఒక భయానక వాతావరణం సృష్టించేందుకే ఈ తరహా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే […]
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం పోరాటం చేస్తున్నందుకే తనపై ఐటీ దాడులు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. కడప ఉక్కుపై కేంద్రమంత్రిని తాను నిలదీశానని దాంతో ఇలా దాడులు చేయిస్తున్నారన్నారు. అయినా సరే తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. తానేమీ స్మగ్లర్‌ను కాదన్నారు సీఎం రమేష్.
కేవలం టీడీపీ నాయకులపైనే ఎందుకు దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీలో ఒక భయానక వాతావరణం సృష్టించేందుకే ఈ తరహా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారిపైనే ఈ తరహా దాడులు చేస్తున్నారు.
జైల్లో పెట్టినాసరే తాము ప్రశ్నించడం మానుకోబోమన్నారు. తనపై ఐటీ దాడులు చేయడం ద్వారా కొండను తవ్వినా ఎలుకను కూడా పట్టలేరన్నారు. మోడీ ప్రభుత్వం చేసే చిల్లర బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీపై పోరాటానికి సిద్దపడినప్పుడే ఇవన్నీ జరుగుతాయని తాము ఊహించామన్నారు.
కేంద్రంతో పెట్టుకుంటే ఏమవుతుందో చూడండి అని మేసేజ్ పంపేందుకే ఈ దాడులు చేస్తున్నారన్నారు. 25 చోట్ల కాకుంటే వంద చోట్ల దాడులుచేసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. కేంద్రం చేసే దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అవును. నిజమే. సీఎం రమేష్ చెప్పినట్టు ఆయన దగ్గర ఏమీ దొరక్కపోవచ్చేమో! ఎన్నోరోజుల క్రితమే చంద్రబాబు తన వాళ్ళందరికీ త్వరలో మనమీద ఐటీ దాడులు జరగవచ్చని చెప్పేశాడు. దాదాపు బినామీలంతా ఎప్పుడో జాగ్రత్త పడిపోయారు. ఇప్పుడు ఏమీ దొరక్కపోయినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి ప్రతిపక్షాలు.
అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ కాంట్రాక్టరుకూ ఇవ్వనన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులను సీఎం రమేష్‌కు ఇచ్చారని, సీఎం రమేష్‌ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ధనాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలను టీడీపీ పెద్దలు నొక్కేస్తున్నారని, సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ అని వైసీపీ నేతలు అంటున్నారు.