దొంగతనాలకోసం రిక్రూట్ మెంట్.... దొంగలకు నెల జీతాలు

ఏదైనా ఒక ప్రొఫెషన్ ను ఎంచుకొని జీవితంలో పైకి రావాలని అందరూ కోరుకుంటారు. కొందరు డాక్టర్లవుతారు… కొందరు ఇంజనీర్లవుతారు. మరికొందరు వ్యాపారం, వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతారు. కానీ ఇక్కడ దొంగతనాలు చేయించేందుకు ఏకంగా రిక్రూట్ మెంట్ చేసుకున్నారు. ప్రతి నెల జీతాలిస్తూ వారితో దొంగతనాలు చేయిస్తున్నారు. క్రైం రేటు ఎక్కువగా ఉండే రాజస్థాన్ లోని జయపురంలో ఈ చోద్యం చోటుచేసుకుంది. అశిష్ మీనా అనే 21 కిలాడీ ఈ ప్లాన్ చేశాడు. అతడు నిరుద్యోగులు, పేదరికంలో […]

Advertisement
Update:2018-10-11 07:56 IST

ఏదైనా ఒక ప్రొఫెషన్ ను ఎంచుకొని జీవితంలో పైకి రావాలని అందరూ కోరుకుంటారు. కొందరు డాక్టర్లవుతారు… కొందరు ఇంజనీర్లవుతారు. మరికొందరు వ్యాపారం, వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతారు. కానీ ఇక్కడ దొంగతనాలు చేయించేందుకు ఏకంగా రిక్రూట్ మెంట్ చేసుకున్నారు. ప్రతి నెల జీతాలిస్తూ వారితో దొంగతనాలు చేయిస్తున్నారు. క్రైం రేటు ఎక్కువగా ఉండే రాజస్థాన్ లోని జయపురంలో ఈ చోద్యం చోటుచేసుకుంది.

అశిష్ మీనా అనే 21 కిలాడీ ఈ ప్లాన్ చేశాడు. అతడు నిరుద్యోగులు, పేదరికంలో మగ్గుతున్న యువకులను చేరదీసి వారిని రిక్రూట్ చేసుకొని వారికి నెలజీతం కింద రూ.15 వేలు చెల్లిస్తూ దొంగతనాలు చేయిస్తున్నాడు. వీరంతా రోజూ మోటార్ సైకిళ్లు, బంగారు గొలుసులు, సెల్ ఫోన్ల దొంగతనం చేసి తీసుకురావాలి.. ఒక్కో దొంగ రోజుకు ఒక్కటైనా దొంగతనం చేయాలి. లేదంటే అతడి జీతంలో కోత విధిస్తాడట అశిష్ మీనా.. రోజూ దొంగతనం చేసి తీసుకొచ్చిన వస్తువులను అమ్ముకొని అశీష్ సొమ్ము చేసుకునేవాడు. ఇలా చాలా మందిని దొంగలుగా మార్చి నిరంతరం దొంగతనాలు ప్రోత్సహించాడు. వరుసగా 36 దొంగతనాలు చేయించాడు.

ఇలా వరుస దొంగనతనాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు.. జైపూర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గౌరవ్ యాదవ్ మాటు వేసి సీసీటీవీలు, కొట్టేసిన సెల్ ఫోన్ సిగ్నల్ సాయంతో దొంగలు అద్దెకుంటున్న ఇంటిని గుర్తించారు. అశిష్ మీనాను అరెస్ట్ చేసి 33 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, బంగారు గొలుసులు, నాలుగు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా దొంగలనే రిక్రూట్ మెంట్ చేయించుకున్న అశిష్ మీనా ఘటన సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News