బ‌తుక‌మ్మ చీర‌ల ప్లేస్‌లో గులాబీ చీర‌లు !

బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ్రేక్ వేసింది. చీర‌ల పంపిణీతో మ‌హిళ‌ల ఓట్లు కొల్లగొడుదామ‌ని అనుకున్న గులాబీ ద‌ళానికి ఈసీ నిర్ణ‌యం షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు మ‌రో రూట్లో నేతలు చీర‌ల పంపిణీ మొద‌లుపెట్టారు. డ్వాక్రా గ్రూపుల మ‌హిళ‌ల‌కు గ్రూపుల వారీగా అధికార పార్టీ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. సైలెంట్‌గా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నేత‌లు చీరల పంపిణీ కార్య‌క్రమాన్ని చేప‌ట్టారు. బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీలో ఆధార్ కార్డు కీల‌కం. ఇక్క‌డ […]

Advertisement
Update:2018-10-08 05:13 IST

బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం బ్రేక్ వేసింది. చీర‌ల పంపిణీతో మ‌హిళ‌ల ఓట్లు కొల్లగొడుదామ‌ని అనుకున్న గులాబీ ద‌ళానికి ఈసీ నిర్ణ‌యం షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు మ‌రో రూట్లో నేతలు చీర‌ల పంపిణీ మొద‌లుపెట్టారు. డ్వాక్రా గ్రూపుల మ‌హిళ‌ల‌కు గ్రూపుల వారీగా అధికార పార్టీ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. సైలెంట్‌గా నియోజ‌క‌వ‌ర్గాల వారీగా నేత‌లు చీరల పంపిణీ కార్య‌క్రమాన్ని చేప‌ట్టారు.

బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీలో ఆధార్ కార్డు కీల‌కం. ఇక్క‌డ గులాబీ నేత‌ల చీర‌ల పంపిణీకి కూడా అదే కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆధార్ కార్డులో ఓటు హ‌క్కుకు అర్హులుగా గుర్తించిన మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే చీర‌లు అంద‌జేస్తున్నారు. పార్టీలో చేరిక‌ల పేరిట మ‌హిళ‌ల‌ను ఆటోల్లో తీసుకువ‌స్తున్నారు. బ‌య‌ట‌కు గులాబీ కండువాలు క‌ప్పి… లోప‌ల మాత్రం చీర‌ల‌ను అంద‌జేస్తున్నారు.

ఇంత‌కుముందు కోలాట నృత్యకారిణుల‌కు చీర‌లు అంద‌జేశారు. గ్రామాల వారీగా కోలాట గ్రూపుల‌కు కానుక‌లు ఇచ్చారు. ఇప్పుడు డ్వాక్రా గ్రూపుల‌ను టార్గెట్ చేశారు. ప్ర‌తి గ్రామంలోని గ్రూపు మ‌హిళ‌ల‌కు చీర‌లు అందేలా స్థానిక నేత‌లు లిస్ట్ సేక‌రిస్తున్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రావ‌డంతో మొన్న‌టిదాకా బ‌హిరంగంగా జ‌రిగిన కార్య‌క్ర‌మం ఇప్పుడు అండ‌ర్‌గ్రౌండ్‌లో చేస్తున్నారు. మ‌రోవైపు చీర‌లు అందుకున్న మ‌హిళ‌ల చేత టీఆర్ఎస్‌కే ఓటేస్తామ‌ని ప్ర‌మాణాలు చేయించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News