అంబులెన్స్‌ సైరన్ వినపడ్డా పోలీస్‌ జీప్‌ అని గోడదూకి పారిపోయే దొంగ చంద్రబాబు

చంద్రబాబు తనకు తాను చట్టాలకు అతీతం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఐటీ దాడులకు వచ్చే అధికారులకు పోలీసు భద్రత కల్పించబోమని చెప్పడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఐటీ రైడ్స్ ఎదుర్కొన్న వారిలో టీడీపీ నేతలు, వైసీపీ నేతలు కూడా ఉన్నారని…. అయినా సరే చంద్రబాబు మాత్రం తనపై ఏదో కుట్ర జరిగిపోతోందని ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. అసలు ఐటీ రైడ్స్ చేయాల్సిన వారిపై చేయడం లేదని అంబటి […]

Advertisement
Update:2018-10-07 12:00 IST

చంద్రబాబు తనకు తాను చట్టాలకు అతీతం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఐటీ దాడులకు వచ్చే అధికారులకు పోలీసు భద్రత కల్పించబోమని చెప్పడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

ఐటీ రైడ్స్ ఎదుర్కొన్న వారిలో టీడీపీ నేతలు, వైసీపీ నేతలు కూడా ఉన్నారని…. అయినా సరే చంద్రబాబు మాత్రం తనపై ఏదో కుట్ర జరిగిపోతోందని ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు.

అసలు ఐటీ రైడ్స్ చేయాల్సిన వారిపై చేయడం లేదని అంబటి వ్యాఖ్యానించారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాస్‌ లాంటి వారిపై దాడులు చేస్తే కట్టలు కట్టలుగా నల్లధనం బయటపడుతుందన్నారు.

రాష్ట్రంలో ఐటీ దాడులు చేయడానికి వీల్లేదని చంద్రబాబు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇష్టానుసారం అవినీతి చేసి నల్లధనం పోగేస్తుంటే ఐటీ దాడులు చేయకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. ఐటీ దాడుల వల్ల రాజధానిలో పెట్టుబడులు పెట్టేవారు భయపడుతారంటున్న చంద్రబాబు… నల్లధనం ఉన్న వారితో పెట్టుబడులు పెట్టించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి జరిగినా, నల్లధనం పోగేసుకున్నా ఐటీ కానీ, ఈడీ గానీ దర్యాప్తు చేయడానికి వీల్లేదని చట్టం ఏమైనా చేస్తారా అని చంద్రబాబును ఉద్దేశించి అంబటి విమర్శించారు.

నల్లధనం ఉన్న వారు భయపడాలి గానీ… ఐటీ దాడులనగానే చంద్రబాబు ఎందుకు అంతగా హైరానా పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. దొంగతనం చేసి ఇంట్లో పడుకుని ఉండగా ఇంటి పక్కనే అంబులెన్స్ వెళ్తుంటే ఆ సైరన్ విని పోలీస్ జీపేమో అనుకుని గోడ దూకి పారిపోయే దొంగ తరహా వ్యక్తి చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు.

నారాయణ, సీఎం రమేష్‌, సుజానా చౌదరి లాంటి ఆర్థిక నేరస్తులందరినీ పార్టీలోకి తీసుకుని చంద్రబాబు డబ్బులు వెదజల్లుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో పంచేందుకు ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 20 కోట్లు సిద్ధం చేశామని నారా లోకేష్ చెప్పినట్టు పవన్ చేసిన వ్యాఖ్యలను అంబటి ప్రస్తావించారు.

తాను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతారని కేసీఆర్‌ హెచ్చరిస్తుంటే…. చంద్రబాబు మాత్రం ఎందుకు ప్రతిసవాల్ చేయలేకపోతున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Tags:    
Advertisement

Similar News