డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు, 11న కౌంటింగ్
తెలంగాణలో ఎన్నికలకు ఈసీ నగారా మోగించింది. నవంబర్ 12న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. తెలంగాణలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తామని సీఈవో రావత్ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 19 వరకు నామినేషన్ల దాఖలకు గడువు… నామినేషన్లను 20న పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేది నవంబర్ 22గా ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల […]
తెలంగాణలో ఎన్నికలకు ఈసీ నగారా మోగించింది. నవంబర్ 12న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. తెలంగాణలో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తామని సీఈవో రావత్ ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 19 వరకు నామినేషన్ల దాఖలకు గడువు… నామినేషన్లను 20న పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేది నవంబర్ 22గా ఈసీ ప్రకటించింది. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉందని రావత్ చెప్పారు.
తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకల కేసు ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని రావత్ చెప్పారు. హైకోర్టు తీర్పు తర్వాత ఓటర్ల జాబితాను విడుదల చేస్తామన్నారు. ఈనెల 8న హైకోర్టుకు ఓటర్ల జాబితా అందజేసి…. ఈనెల 12న జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, చత్తీస్ గడ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. రాజస్థాన్‌కు కూడా ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.