మళ్లీ తెరపైకి మార్గదర్శి కేసు.... రామోజీకి సుప్రీంలో చుక్కెదురు

గతంలో సంచలనం సృష్టించిన మార్గదర్శి కేసు మరోసారి కదిలింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థ నిబంధనలకు విరుద్దంగా భారీగా డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణ. ఈ కుంభకోణాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్పట్లో వెలుగులోకి తెచ్చారు. కుంభకోణంపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు స్పందించిన నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జీవో కూడా జారీ చేసింది. అయితే వెంటనే రామోజీరావు హైకోర్టు ఆ తర్వాత, సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి […]

Advertisement
Update:2018-10-05 08:35 IST

గతంలో సంచలనం సృష్టించిన మార్గదర్శి కేసు మరోసారి కదిలింది. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థ నిబంధనలకు విరుద్దంగా భారీగా డిపాజిట్లు సేకరించినట్టు ఆరోపణ. ఈ కుంభకోణాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్ అప్పట్లో వెలుగులోకి తెచ్చారు.

కుంభకోణంపై విచారణ జరపాలని కోరారు. ఇందుకు స్పందించిన నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం జీవో కూడా జారీ చేసింది. అయితే వెంటనే రామోజీరావు హైకోర్టు ఆ తర్వాత, సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కేసు స్టే మీద ఉంది.

అయితే ముఖ్యమైన కేసులు ఏవైనా ఉంటే ఆరు నెలలకు మించి స్టే పొడిగించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా ఇప్పుడు మార్గదర్శి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

స్టేను మరింత కాలం పొడిగించాలని రామోజీరావు కోరినా సుప్రీం కోర్టు అందుకు అంగీకరించలేదు. మార్గదర్శి వ్యవహారంపై స్పందన తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇప్పుడే తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండడం, చంద్రబాబు అండ్ టీం కాంగ్రెస్‌తో చేతులు కలిపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్న దానిపై చర్చ జరుగుతోంది.

Tags:    
Advertisement

Similar News