నన్ను ప్రధానిగా ప్రచారం చేయొద్దు ప్లీజ్

చంద్రబాబు గొంతులో హఠాత్తుగా మార్పు వచ్చింది. మొన్నటి వరకు తాను ప్రపంచానికే పాఠాలు చెప్పాను, ప్రధాని అయ్యే అవకాశం వస్తే వదిలేశాను…. నా రేంజ్ మోడీ కంటే ఎక్కువ అంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు గొంతు సవరించుకున్నారు. అమరావతితో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. ఇకపై ఎవరూ కూడా తాను ప్రధాన మంత్రిని అవుతానంటూ ప్రచారం చేయవద్దని ఆదేశించారు. అలా చేయడం వల్ల ఇబ్బందులు […]

Advertisement
Update:2018-10-04 04:30 IST

చంద్రబాబు గొంతులో హఠాత్తుగా మార్పు వచ్చింది. మొన్నటి వరకు తాను ప్రపంచానికే పాఠాలు చెప్పాను, ప్రధాని అయ్యే అవకాశం వస్తే వదిలేశాను…. నా రేంజ్ మోడీ కంటే ఎక్కువ అంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు గొంతు సవరించుకున్నారు.

అమరావతితో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నేతలకు చంద్రబాబు కొన్ని సూచనలు చేశారు. ఇకపై ఎవరూ కూడా తాను ప్రధాన మంత్రిని అవుతానంటూ ప్రచారం చేయవద్దని ఆదేశించారు. అలా చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేస్తున్నట్టు వివరించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలను తనను ఇబ్బంది పెట్టేందుకే తెచ్చారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పార్టీపై చాలా కుట్రలు జరుగుతున్నాయని వాటిని ఎదుర్కొవాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో టీడీపీని ఫినిష్ చేసేందుకు కేసీఆర్‌ పావులు కదుపుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ తాను ఎదగడం గురించి ఆలోచించకుండా టీడీపీని తొక్కేయడం ఎలా అన్న దానిపైనే ఆలోచన చేస్తున్నారని…. ఇది సరైన పద్దతి కాదని చంద్రబాబు విమర్శించారు. టీడీపీని ఇబ్బందిపెట్టేందుకే ఓటుకు నోటు కేసును తిరగదోడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

Tags:    
Advertisement

Similar News