18 ఏళ్ల వయసులోనే పృథ్వీ షాకు టెస్ట్ క్యాప్

విండీస్ తో తొలిటెస్ట్ ద్వారా పృథ్వీ షా టెస్ట్ అరంగేట్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్ 14 మ్యాచ్ ల్లో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల పృథ్వీ షా టెస్ట్ క్యాప్ అందుకోబోతున్న భారత 293వ క్రికెటర్ పృథ్వీ షా ముంబై యువ ఓపెనర్ పృథ్వీ షా….18 ఏళ్ల చిరుప్రాయంలోనే టెస్ట్ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. రాజ్ కోట్ వేదికగా విండీస్ తో  ప్రారంభమయ్యే తొలిటెస్ట్ ద్వారా…. పృథ్వీ షా తన తొలిటెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. భారత కెప్టెన్ గా […]

Advertisement
Update:2018-10-03 10:50 IST
  • విండీస్ తో తొలిటెస్ట్ ద్వారా పృథ్వీ షా టెస్ట్ అరంగేట్రం
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ 14 మ్యాచ్ ల్లో 7 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీల పృథ్వీ షా
  • టెస్ట్ క్యాప్ అందుకోబోతున్న భారత 293వ క్రికెటర్ పృథ్వీ షా

ముంబై యువ ఓపెనర్ పృథ్వీ షా….18 ఏళ్ల చిరుప్రాయంలోనే టెస్ట్ అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. రాజ్ కోట్ వేదికగా విండీస్ తో ప్రారంభమయ్యే తొలిటెస్ట్ ద్వారా…. పృథ్వీ షా తన తొలిటెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు.

భారత కెప్టెన్ గా జూనియర్ ప్రపంచకప్ అందించిన పృథ్వీ షా…. దేశవాళీ రంజీట్రోఫీ, దులీప్ ట్రోఫీ టోర్నీల్లో సైతం నిలకడగా రాణించడం ద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

పృథ్వీ షా తన ఫస్ట్ క్లాస్ కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 14 మ్యాచ్ ల్లో 56.72 సగటు నమోదు చేశాడు. ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలతో పృథ్వీ షా సత్తా చాటుకొన్నాడు.

సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా…. కెెఎల్ రాహుల్ తో కలిసి టీమిండియా బ్యాటింగ్ ను పృథ్వీ షా ప్రారంభించనున్నాడు.

293వ భారత టెస్ట్ క్రికెటర్ గా…ఈ చిట్టిపొట్టి ఓపెనర్ రికార్డుల్లో చేరనున్నాడు. ఐపీఎల్ గత సీజన్లో ఢిల్లీ ఫ్రాంచైజీ కోటీ 20 లక్షల రూపాయల వేలం ధరకు పృథ్వీ షాను సొంతం చేసుకొంది. భారత మాజీ కెప్టెన్, జూనియర్ ఇండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ శిక్షణలో రాటు దేలిన పృథ్వీ షా…. భారత్ కు జూనియర్ ప్రపంచకప్ సైతం అందించిన సంగతి తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News