అరకు పీఎస్‌పై దాడిలో వాళ్లూ ఉన్నారు " చంద్రబాబు

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చాలా బలమైన నేత అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. కిడారి చాలా చురుగ్గా పనిచేసేవారన్నారు. అలాంటి వ్యక్తిని మావోయిస్టుల హత్య చేయడం దురదృష్టకరమన్నారు. బాక్సైట్‌ విషయంలో పలుమార్లు క్లారిటీ ఇచ్చానన్నారు. బాక్సైట్ అనుమతులు రద్దు చేసింది తానేనని చంద్రబాబు చెప్పారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సే అనుమతి ఇచ్చారన్నారు. అయినా ఇప్పటికీ తమపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అలిపిరి వద్ద తనపై దాడి చేసిన చలపతి నేతృత్వంలోనే కిడారిపైనా దాడి జరిగిందన్నారు. సంచలనం కోసమే […]

Advertisement
Update:2018-10-03 10:04 IST

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు చాలా బలమైన నేత అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. కిడారి చాలా చురుగ్గా పనిచేసేవారన్నారు. అలాంటి వ్యక్తిని మావోయిస్టుల హత్య చేయడం దురదృష్టకరమన్నారు.

బాక్సైట్‌ విషయంలో పలుమార్లు క్లారిటీ ఇచ్చానన్నారు. బాక్సైట్ అనుమతులు రద్దు చేసింది తానేనని చంద్రబాబు చెప్పారు. బాక్సైట్ తవ్వకాలకు వైఎస్సే అనుమతి ఇచ్చారన్నారు. అయినా ఇప్పటికీ తమపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అలిపిరి వద్ద తనపై దాడి చేసిన చలపతి నేతృత్వంలోనే కిడారిపైనా దాడి జరిగిందన్నారు. సంచలనం కోసమే ఈ హత్యలు చేశారని విమర్శించారు.

టీడీపీకి చెందిన ఒక వ్యక్తిని లోబరుచుకుని కిడారి హత్యను మావోయిస్టులు చేశారన్నారు. అయితే సదరు వ్యక్తి ఇటీవలే టీడీపీలో చేరారని చంద్రబాబు చెప్పారు. హత్యల తర్వాత అరకు పోలీస్ స్టేషన్‌పైనా దాడి జరిగిందన్నారు. పోలీస్ స్టేషన్‌పై దాడిలో తమ పార్టీ కార్యకర్తలే కాకుండా వైసీపీ వాళ్లు కూడా ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు.

అమెరికా వెళ్తూ విమానంలో నుంచే తాను పరిస్థితిని సమీక్షించానని చెప్పారు. అమెరికాలో తన కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలు మొత్తం వచ్చారని చంద్రబాబు చెప్పారు. అయితే ఎమ్మెల్యే హత్య నేపథ్యంలో సింపుల్‌గా మీటింగ్ నిర్వహించామని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News