వనపర్తి చిన్నారెడ్డి సీటు మారుతారా?
మహాకూటమి పొత్తులు ఇంకా పూర్తి కాలేదు. సీట్ల సర్దుబాటు కాలేదు. టీడీపీకి ఇంకా ఎన్ని సీట్లు ఇస్తారో తెలియలేదు. కానీ ఓ ఇద్దరు నేతలు మాత్రం సీట్లు సర్దుబాటు చేసుకున్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలే కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి. ఈ ఇద్దరు నేతలు వనపర్తికి చెందిన వారే. అంతేకాదు మంచి మిత్రులు. ఒకప్పుడు క్లాస్‌మేట్స్. తెలంగాణ ఏర్పడిన తర్వాత రావులను చిన్నారెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. తాను పక్కకు […]
మహాకూటమి పొత్తులు ఇంకా పూర్తి కాలేదు. సీట్ల సర్దుబాటు కాలేదు. టీడీపీకి ఇంకా ఎన్ని సీట్లు ఇస్తారో తెలియలేదు. కానీ ఓ ఇద్దరు నేతలు మాత్రం సీట్లు సర్దుబాటు చేసుకున్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరు నేతలే కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి.
ఈ ఇద్దరు నేతలు వనపర్తికి చెందిన వారే. అంతేకాదు మంచి మిత్రులు. ఒకప్పుడు క్లాస్‌మేట్స్. తెలంగాణ ఏర్పడిన తర్వాత రావులను చిన్నారెడ్డి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. తాను పక్కకు తప్పుకుంటానని…. వనపర్తి నుంచి పోటీ చేయాలని ఆఫర్ ఇచ్చారు. అయితే ఈలోగా రాజకీయాలు మారాయి. కాంగ్రెస్, టీడీపీ పొత్తు పొడిచింది. దీంతో రావుల పాతపార్టీలోనే ఉండిపోయారు.
ఇప్పుడు పొత్తులో భాగంగా వనపర్తి సీటును టీడీపీకి ఇచ్చేందుకు చిన్నారెడ్డి ఒకే అంటున్నారు. తాను కావాలంటే పక్కనే ఉన్న దేవరకద్ర నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. గతంలో వనపర్తి నియోజకవర్గానికి చెందిన కొన్ని మండలాలు నియోజకవర్గ పునర్విభజన సందర్భంగా దేవరకద్రలో కలిశాయి. ఈ మండలాలు చిన్నారెడ్డి కుటుంబానికి బాగా పలుకుబడి ఉన్న ప్రాంతాలు. అందువల్ల దేవరకద్ర నుంచి పోటీ చేసినా గెలుస్తానని చిన్నారెడ్డి ధీమాగా ఉన్నారని చెబుతున్నారు.
2014 ఎన్నికల్లో వనపర్తిలో చిన్నారెడ్డి గెలిచారు. రెండోస్థానంలో టీఆర్ఎస్‌కి చెందిన నిరంజన్‌రెడ్డి నిలిచారు. మూడోస్థానంలో రావుల ఉండిపోయారు. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలని నిరంజన్‌రెడ్డి ప్లాన్‌లు వేస్తున్నారు. చిన్నారెడ్డికి 59,543 ఓట్లు వస్తే… నిరంజన్‌రెడ్డికి 55,252 ఓట్లు వచ్చాయి. రావుల చంద్రశేఖర్‌రెడ్డికి 45,200 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్,టీడీపీ పొత్తులో భాగంగా ఇద్దరు మిత్రులు కలిస్తే నిరంజన్‌రెడ్డిని ఈజీగా ఓడించవచ్చని ప్రణాళికలు వేస్తున్నారు.