ఉత్తమ్‌పై ఎన్ఆర్ఐ పోటీ.... శంకరమ్మ కండిషన్‌తో మారిన గులాబీ ప్లాన్ !
టీఆర్ఎస్‌లో 14 టికెట్ల కేటాయింపు ఇంకా జరగలేదు. ఈ సీట్లలో గ్రూపుల గొడవలు, సర్దుబాట్లు, నేతల డిమాండ్లతో కేటాయింపుల వ్యవహారం రోజురోజుకు పోస్ట్‌పోన్ అవుతోంది. కాంగ్రెస్ లిస్ట్ వచ్చేలోపే ఈ 14 మంది జాబితా కూడా ప్రకటించాలని గులాబీబాస్ ఆలోచన. దసరా లోపు లిస్ట్ ప్రకటించేసి పూర్తిగా ఎన్నికల యుద్ధరంగంలోనే సైనికులు ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. 14 స్థానాల అభ్యర్థుల ఎంపికలో గులాబీ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, హుజూర్‌నగర్, వరంగల్ తూర్పు, చొప్పదండి […]
టీఆర్ఎస్‌లో 14 టికెట్ల కేటాయింపు ఇంకా జరగలేదు. ఈ సీట్లలో గ్రూపుల గొడవలు, సర్దుబాట్లు, నేతల డిమాండ్లతో కేటాయింపుల వ్యవహారం రోజురోజుకు పోస్ట్‌పోన్ అవుతోంది. కాంగ్రెస్ లిస్ట్ వచ్చేలోపే ఈ 14 మంది జాబితా కూడా ప్రకటించాలని గులాబీబాస్ ఆలోచన. దసరా లోపు లిస్ట్ ప్రకటించేసి పూర్తిగా ఎన్నికల యుద్ధరంగంలోనే సైనికులు ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.
14 స్థానాల అభ్యర్థుల ఎంపికలో గులాబీ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఖైరతాబాద్, హుజూర్‌నగర్, వరంగల్ తూర్పు, చొప్పదండి లాంటి సీట్ల విషయంలో టీఆర్ఎస్ సున్నితంగా వ్యవహరిస్తోంది. ఇక్కడ సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వకుంటే ఓ తలనొప్పి… ఇస్తే మరో సమస్య వచ్చేలా పరిస్థితి తయారైంది.
ఈ 14 సీట్లలో హుజూర్‌నగర్ సీటు మరింత ఆసక్తికరంగా మారింది. ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు 2014లో టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆమె పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈ సారి టికెట్ కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనకే టికెట్ ఇవ్వాలని అనుచరులు కూడా ధర్నాలు చేశారు.
ఉత్తమ్‌పై బలమైన అభ్యర్థిని నిలబెట్టాలనేది గులాబీ బాస్ ప్లాన్. అందుకోసం కొన్నిరోజులుగా అభ్యర్థుల వడపోత చేపట్టారు. శంకరమ్మను నిలబెడితే గెలవడం కష్టమని సర్వేలు తేల్చాయి. దీంతో తమ ముందున్న ఆప్షన్లను గులాబీ బాస్ పరిశీలించారు. ఎన్ఆర్ఐలు సైదిరెడ్డి, అప్పిరెడ్డిలు పోటీకి ఆసక్తి చూపారు. శంకరమ్మ కూడా టికెట్ అడగడంతో ఇక్కడ సమస్య వచ్చి పడింది.
కొన్ని రోజులుగా హుజూర్‌నగర్ టికెట్ విషయంలో శంకరమ్మ కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఎన్ఆర్ఐ అప్పిరెడ్డికి టికెట్ ఇస్తే తనకు అభ్యంతరం లేదని పార్టీ అధిష్టానానికి చెప్పింది. వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా తాను ఒప్పుకోనేది లేదని స్పష్టం చేసింది. దీంతో శంకరమ్మ కొత్త ప్రతిపాదనతో గులాబీ హైకమాండ్… ఈవిషయంలో ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పిరెడ్డి గెలుపుపై నివేదికలు, సర్వేలు తెప్పిస్తుంది. మరీ హూజూర్‌నగర్ టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.