భారత క్రికెట్ కోటలో కరీబియన్ ఆర్మీ పాగా
అక్టోబర్ 4 నుంచి టీమిండియాతో విండీస్ టెస్ట్ సిరీస్ టీమిండియా తో విండీస్ 2 మ్యాచ్ ల టెస్ట్, 5 మ్యాచ్ ల వన్డే, 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్ అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ భారత్ లో ఐదువారాల పర్యటన కోసం…జేసన్ హోల్డర్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టు తరలి వచ్చింది. కరీబియన్ ఆర్మీ తన పర్యటన కాలంలో…రెండుమ్యాచ్ ల టెస్ట్, ఐదుమ్యాచ్ ల వన్డే, మూడు మ్యాచ్ ల టీ-20 […]
- అక్టోబర్ 4 నుంచి టీమిండియాతో విండీస్ టెస్ట్ సిరీస్
- టీమిండియా తో విండీస్ 2 మ్యాచ్ ల టెస్ట్, 5 మ్యాచ్ ల వన్డే, 3 మ్యాచ్ ల టీ-20 సిరీస్
- అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్
భారత్ లో ఐదువారాల పర్యటన కోసం…జేసన్ హోల్డర్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టు తరలి వచ్చింది. కరీబియన్ ఆర్మీ తన పర్యటన కాలంలో…రెండుమ్యాచ్ ల టెస్ట్, ఐదుమ్యాచ్ ల వన్డే, మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ల్లో పాల్గోనుంది.
రాజ్ కోట సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా అక్టోబర్ 4 నుంచి తొలిటెస్ట్, హైదరాబాద్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా అక్టోబర్ 12 నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు.
ఆ తర్వాత అక్టోబర్ 21 నుంచి నవంబర్ 1 వరకూ ఐదుమ్యాచ్ ల వన్డే సిరీస్, నవంబర్ 4 నుంచి 11 వరకూ తీన్మార్ వన్డే సిరీస్ నిర్వహిస్తారు. 1948 నుంచి వెస్టిండీస్, టీమిండియా జట్లు… 98 టెస్టుల్లో తలపడితే…. కరీబియన్ టీమ్ 30, భారత్ 28 విజయాలు సాధించగా…మరో 46 టెస్టులు డ్రాల పద్దులో చేరాయి.
టీమిండియాకు విరాట్ కొహ్లీ, కరీబియన్ టీమ్ కు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ నాయకత్వం వహిస్తున్నారు.
టెస్టుజట్టులో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్….
వెస్టిండీస్ తో ఈనెల 4 నుంచి ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో పాల్గొనే…..విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కింది.
జట్టులోని ఇతర ఆటగాళ్లలో అజింక్యా రహానే, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, రాహుల్, హనుమ విహారి, చతేశ్వర్ పూజారా, రిషభ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ రియాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.
రాజ్ కోట లో తొలిటెస్ట్ సమరం….
రాజ్ కోట వేదికగా అక్టోబర్ 4 నుంచి తొలిటెస్ట్, అక్టోబర్ 12 నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రెండోటెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. నాటితరం పేస్ బౌలర్ సయ్యద్ అబీద్ అలీ తర్వాత… భారత టెస్టుజట్టులో చోటు సంపాదించిన రెండో హైదరాబాదీ పేసర్ గా మహ్మద్ సిరాజ్ గుర్తింపు తెచ్చుకొన్నాడు.
హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన ఓ ఆటోడ్రైవర్ కుటుంబం నుంచి వచ్చిన 24 ఏళ్ల మహ్మద్ సిరాజ్… ఐపీఎల్ గత రెండు సీజన్లతో పాటు…. ఇండియా-ఏ జట్టు సభ్యుడిగాను సత్తాచాటుకొని… సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పటికే టీమిండియా టీ-20 క్యాప్ అందుకొన్న సిరాజ్… ప్రస్తుత టెస్ట్ సిరీస్ ద్వారా… టెస్ట్ క్యాప్ సైతం అందుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సెలక్టర్లపై మాజీల విమర్శలు…
విండీస్ తో టెస్ట్ సిరీస్ కు భారతజట్టులో రోహిత్ శర్మకు చోటు లేకపోడంపై విమర్శలు వెల్లువెత్తాయి. భారత మాజీ ఆఫ్ స్పిన్నర్, ప్రస్తుత కామెంటీటర్ హర్భజన్ సింగ్…. బీసీసీఐ సెలక్షన్ కమిటీపై మండిపడ్డాడు. వెస్టిండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు…. రోహిత్ శర్మను ఎంపిక చేయకపోడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆసియాకప్ లో టీమిండియాను విజేతగా నిలపడం తో పాటు… ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సహా 317 పరుగులు సాధించడం ద్వారా సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మను ఎందుకు పక్కనపెట్టారో సెలక్టర్లు చెప్పాలని ట్విట్టర్ ద్వారా నిలదీశాడు.
మరో మాజీ కెప్టెన్, కామెంటీటర్ సౌరవ్ గంగూలీ సైతం… రోహిత్ శర్మను ఎంపిక చేయకపోడాన్ని తప్పుపట్టాడు. ఫామ్ లో ఉన్న రోహిత్ శర్మ లాంటి ఆటగాడిని పక్కన పెట్టడం వెనుక ఎంపిక సంఘం ఆలోచన ఏమిటో తనకు అర్థంకావడంలేదని చెప్పాడు. ఇదిలా ఉంటే… ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రోహిత్ శర్మ రెండోర్యాంకులో నిలిచాడు.
రెండోర్యాంకులో రోహిత్ శర్మ….
టీమిండియా డాషింగ్ ఓపెనర్, వన్డే క్రికెట్ స్టాప్ గ్యాప్ కెప్టెన్ రోహిత్ శర్మ…తన కెరియర్ లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఐసీసీ వన్డే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం రోహిత్ శర్మ…. టాప్ ర్యాంకర్ విరాట్ కొహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన 2018 ఆసియాకప్ టోర్నీలో టీమిండియాను విజేతగా నిలపడమే కాదు… ఓపెనర్ గా ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో సహా 317 పరుగులు సాధించాడు.
105.66 సగటుతో ఆసియాకప్ లో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాట్స్ మన్ గా రికార్డుల్లో చేరాడు. ఆసియాకప్ కు దూరమైనా… విరాట్ కొహ్లీ టాప్ ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు.