అలాంటి సీన్స్ తో నేను సినిమాలు తీస్తాను
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా ఈ ఏడాది “లవర్” “శ్రీనివాస కళ్యాణం” రెండు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు వచ్చినవి వచ్చినట్టుగానే ధియేటర్స్ నుంచి వెళ్ళిపోయాయి. అయితే ప్రస్తుతం కిస్ సీన్స్ లేకపోతె సినిమాలు ఆడటం లేదని దిల్ రాజు అంటున్నారు. ఈ వ్యాఖ్యలు దిల్ రాజు “ఆర్ ఎక్స్100” సినిమా ని గురించే అన్నాడు. ప్రేక్షకులు ఎవరూ మంచి,చేడు ఆలోచించడం లేదని, ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనేదే చూస్తున్నారు అని దిల్ రాజు ఫీల్ […]
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా ఈ ఏడాది “లవర్” “శ్రీనివాస కళ్యాణం” రెండు సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలు వచ్చినవి వచ్చినట్టుగానే ధియేటర్స్ నుంచి వెళ్ళిపోయాయి. అయితే ప్రస్తుతం కిస్ సీన్స్ లేకపోతె సినిమాలు ఆడటం లేదని దిల్ రాజు అంటున్నారు. ఈ వ్యాఖ్యలు దిల్ రాజు “ఆర్ ఎక్స్100” సినిమా ని గురించే అన్నాడు. ప్రేక్షకులు ఎవరూ మంచి,చేడు ఆలోచించడం లేదని, ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా అనేదే చూస్తున్నారు అని దిల్ రాజు ఫీల్ అయ్యాడు.
ఫ్యామిలీతో హాయిగా ఎంజాయ్ చేసే సినిమాలు నేను నిర్మించినా… ఎవరు చూడటం లేదు అని దిల్ రాజు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ఇష్టాల గురించి మాట్లాడాడు. తాను నిర్మించే సినిమాల్లో ఇక తానూ కూడా కిస్ సీన్స్ పెట్టాలేమో అని అంటున్నాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
ఫ్లాపులతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయిన దిల్ రాజు ఇలా అని చాలా మందిని షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే సినిమాలు ఎప్పుడు ఫ్లాప్ అయిన కూడా దిల్ రాజు గతంలో ఇతర సినిమాలపై కామెంట్స్ చేయలేదు. కానీ మొదటి సారి ఇలా ఇతర సినిమా సక్సెస్ పై కామెంట్ చేసాడు దిల్ రాజు.