పరకాల నుంచే సురేఖ పోటీ

టీఆర్‌ఎస్‌ నుంచి అవమానకర పరిస్థితుల నడుమ బయటకు వచ్చేసిన కొండా దంపతులు భవిష్యతు గురించి ఆలోచనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో తనతో పాటు తన కుమార్తెకు సురేఖ సీటు ఆశించారు. కానీ కేసీఆర్‌ ఏకంగా కొండా సురేఖ టికెట్టే పెండింగ్‌లో ఉంచేశారు. దాంతో కేసీఆర్‌, కేటీఆర్‌పై కొండా దంపతులు తీవ్ర ఆరోపణలు చేశారు. తాము హరీష్ రావు వర్గమని అందుకే కేటీఆర్‌ టార్గెట్ చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ఉండలేని పరిస్థితులతో కొండా దంపతులు రాహుల్ సమక్షంలో ఇటీవల కాంగ్రెస్‌లో […]

Advertisement
Update:2018-10-01 07:53 IST

టీఆర్‌ఎస్‌ నుంచి అవమానకర పరిస్థితుల నడుమ బయటకు వచ్చేసిన కొండా దంపతులు భవిష్యతు గురించి ఆలోచనలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో తనతో పాటు తన కుమార్తెకు సురేఖ సీటు ఆశించారు. కానీ కేసీఆర్‌ ఏకంగా కొండా సురేఖ టికెట్టే పెండింగ్‌లో ఉంచేశారు. దాంతో కేసీఆర్‌, కేటీఆర్‌పై కొండా దంపతులు తీవ్ర ఆరోపణలు చేశారు.

తాము హరీష్ రావు వర్గమని అందుకే కేటీఆర్‌ టార్గెట్ చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ఉండలేని పరిస్థితులతో కొండా దంపతులు రాహుల్ సమక్షంలో ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ కూడా కొండా కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే ఇస్తామని హామీ ఇచ్చారు.

మరోదారి లేక అందుకు వారు ఓకే చేశారు. కొండా సురేఖ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇందుకు ఆమె సమాధానం ఇచ్చారు. ఎన్నికల్లో పరకాల నియోజవకర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. భూపాలపల్లి, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు, అభిమానులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు.

కానీ తాను పరకాలలో పోటీ చేయడంతో పాటు వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కాంగ్రెస్‌కు ఈసారి పది సీట్లు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News