విశాల్ మార్కెట్ ను డిసైడ్ చేసే సినిమా

దాదాపు నాలుగేళ్లుగా టాలీవుడ్ లో విశాల్ కు ఎలాంటి మార్కెట్ లేకుండా పోయింది. అతడు చేసిన సినిమాలు అలాంటివి మరి. రీసెంట్ గా వచ్చిన డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో కూసింత తేరుకున్నాడు ఈ హీరో. తెలుగులో ఈ సినిమాలు కూడా క్లిక్ అవ్వడంతో, టాలీవుడ్ లో అతడి మార్కెట్ మళ్లీ గాడిలో పడింది. ఇలాంటి టైమ్ లో మరో సినిమా తేడాకొడితే, ఇప్పటివరకు సంపాదించుకున్న క్రేజ్, మార్కెట్ మొత్తం పోతుంది. అందుకే పందెంకోడి-2పై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు […]

Advertisement
Update:2018-09-30 04:04 IST

దాదాపు నాలుగేళ్లుగా టాలీవుడ్ లో విశాల్ కు ఎలాంటి మార్కెట్ లేకుండా పోయింది. అతడు చేసిన సినిమాలు అలాంటివి మరి. రీసెంట్ గా వచ్చిన డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాలతో కూసింత తేరుకున్నాడు ఈ హీరో. తెలుగులో ఈ సినిమాలు కూడా క్లిక్ అవ్వడంతో, టాలీవుడ్ లో అతడి మార్కెట్ మళ్లీ గాడిలో పడింది. ఇలాంటి టైమ్ లో మరో సినిమా తేడాకొడితే, ఇప్పటివరకు సంపాదించుకున్న క్రేజ్, మార్కెట్ మొత్తం పోతుంది. అందుకే పందెంకోడి-2పై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు విశాల్.

తన సినిమాలకు సంబంధించి తమిళ రిలీజ్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు విశాల్. తెలుగులో ప్రెస్ మీట్లు పెట్టినా అన్నీ పైపైనే. అయితే డిటెక్టివ్, అభిమన్యుడు సినిమాల నుంచి విశాల్ తన ప్లాన్ మార్చాడు. తెలుగులో కూడా ప్రచారం చేస్తున్నాడు. ప్రెస్ మీట్స్ తో సరిపెట్టకుండా, కీలకమైన ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు పందెంకోడి-2కు సంబంధించి కూడా ఇలాంటి వినూత్న ప్రచారమే చేయబోతున్నాడు విశాల్.

అక్టోబర్ 18న ఈ సినిమా విడుదలకానుంది. అంతకంటే ముందే తెలుగు రాష్ట్రాల్లో పందెంకోడి-2కు సంబంధించి ఓ వినూత్న కార్యక్రమం ప్లాన్ చేశాడు విశాల్. త్వరలోనే హీరోయిన్ కీర్తిసురేష్ తో కలిసి ఆ కార్యక్రమం ఏంటనేది బయటపెట్టబోతున్నాడు. పందెంకోడి సినిమా తెలుగులో కూడా హిట్ అయింది.

తాజాగా వచ్చిన క్రేజ్ కు, పందెంకోడి బజ్ ను కూడా కలిపి ఇంకాస్త మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్నాడు విశాల్. ఈ హీరో చేపట్టనున్న ఆ వినూత్న కార్యక్రమం ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags:    
Advertisement

Similar News