విఎంసి మాయాజాలం.... బ్యాంకులకు కోట్లాది రూపాయల ఎగనామం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. టెలికాం విడిభాగాలు తయారు చేసే విఎంసి కంపెనీ బ్యాంకుల కన్సార్టియంకు 1700 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన సిబిఐ…. విఎంసి కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపై, కార్యాలయాల పైనా దాడులు చేసి సోదాలు చేసింది. పలు కీలక ఆధారాలను సేకరించింది. కంపెనీ డైరెక్టర్లు…. బ్యాంకుల నుంచి పొందిన రుణాలను స్వాహా చేస్తున్నట్లు […]
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న విఎంసి సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. టెలికాం విడిభాగాలు తయారు చేసే విఎంసి కంపెనీ బ్యాంకుల కన్సార్టియంకు 1700 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలో దిగిన సిబిఐ…. విఎంసి కంపెనీ డైరెక్టర్ల ఇళ్లపై, కార్యాలయాల పైనా దాడులు చేసి సోదాలు చేసింది. పలు కీలక ఆధారాలను సేకరించింది.
కంపెనీ డైరెక్టర్లు…. బ్యాంకుల నుంచి పొందిన రుణాలను స్వాహా చేస్తున్నట్లు పసిగట్టిన పంజాబ్ నేషనల్ బ్యాంక్…సిబిఐకి ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు … ఉప్పలపాటి హిమబిందు, ఉప్పలపాటి రామారావు, భాగవతుల వెంకట రమణలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
విఎంసి కంపెనీకి టెలికాం పరికరాల తయారీ కోసం హైదరాబాద్ సమీపంలోని రావిర్యాల దగ్గర ఉత్పత్తి యూనిట్ ఉంది. ఈ యూనిట్లో తయారయ్యే పరికరాలను కంపెనీ…. బిఎస్‌ఎన్ఎల్‌తో పాటు వివిధ కంపెనీలకు సరఫరా చేస్తోంది.
విఎంసి కంపెనీ బాకీల చిట్టా
విఎంసి కంపెనీ పలు బ్యాంకుల నుంచి కోట్లాది రూపాయల రుణం తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.539 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.1207 కోట్లు, ఆంధ్రా బ్యాంక్, జెఎం ఫైనాన్సియల్ ఎసెట్స్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు కూడా కోట్లాది రూపాయలు బకాయిలు పడింది.
2009లో బ్యాంకుల నుంచి రుణాలు
విఎంసి సిస్టమ్స్ కంపెనీ 2009 ఆగస్టు 12న వర్కింగ్ క్యాపిటల్ క్రెడిట్ కింద దాదాపు 1010.50 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను వేరే ఇతర పనులకు వాడుకున్నట్లు, ప్రమోటర్లు స్వాహా చేస్తున్నట్లు పసిగట్టిన పంజాబ్ నేషనల్ బ్యాంక్… సిబిఐకి ఫిర్యాదు చేసింది.