గ్రూప్-2 మెయిన్స్ యథాతథం
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న కమిషన్
Advertisement
ఫిబ్రవరి 23 (ఆదివారం) జరగబోయే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 జరుగుతుందని కమిషన్ పేర్కొన్నది. అభ్యర్థులు 15 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. గ్రూప్-2 మెయిన్స్ వాయిదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కమిషన్ తెలిపింది.
Advertisement