కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తా

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఇప్పటికే టాలీవుడ్ అట్టుడికిపోతోంది. శ్రీరెడ్డి, ఏ రోజు ఎవరిపై ఏ తరహా ఆరోపణలు చేస్తుందో అర్థంకాని పరిస్థితి. బాలీవుడ్ లో మొన్నటివరకు ఇలాంటి ఆరోపణల్ని కేవలం రాధికా ఆప్టే మాత్రమే చేసేది. ఇప్పుడా బాధ్యతను తనుశ్రీ దత్తా తీసుకుంది. మొన్నటికిమొన్న నటుడు నానా పటేకర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తా, ఈసారి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై విరుచుకుపడింది. కెరీర్ స్టార్టింగ్ లో తనకు అవకాశం ఇచ్చిన వివేక్.. ఓ […]

Advertisement
Update:2018-09-28 13:05 IST

కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఇప్పటికే టాలీవుడ్ అట్టుడికిపోతోంది. శ్రీరెడ్డి, ఏ రోజు ఎవరిపై ఏ తరహా ఆరోపణలు చేస్తుందో అర్థంకాని పరిస్థితి. బాలీవుడ్ లో మొన్నటివరకు ఇలాంటి ఆరోపణల్ని కేవలం రాధికా ఆప్టే మాత్రమే చేసేది. ఇప్పుడా బాధ్యతను తనుశ్రీ దత్తా తీసుకుంది.

మొన్నటికిమొన్న నటుడు నానా పటేకర్ పై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన తనుశ్రీ దత్తా, ఈసారి దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై విరుచుకుపడింది. కెరీర్ స్టార్టింగ్ లో తనకు అవకాశం ఇచ్చిన వివేక్.. ఓ రాత్రి తనను ఇంటికి పిలిచి బట్టలు తీసి డాన్స్ చేయమని డిమాండ్ చేశాడంటూ ఆరోపించింది.

చాక్లెట్ అనే సినిమాలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో నటించింది తనుశ్రీ దత్తా. ఆమెకిది కెరీర్ లో రెండో సినిమా మాత్రమే. అందుకే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తనుశ్రీ ఆరోపించింది. అయితే అదే సమయంలో అక్కడున్న ఇర్ఫాన్ ఖాన్, సునీల్ షెట్టి దర్శకుడ్ని వారించారని. అలా ఓ చేదు అనుభవం నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది తనుశ్రీ దత్తా.

Tags:    
Advertisement

Similar News