అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై నాగ్ వివరణ

ఈ పుకార్లు ఇప్పటివి కావు. అఖిల్ మొదటి సినిమా చేసినప్పట్నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, మొదటి సినిమా చేసిన వెంటనే, తన రెండో సినిమాను బాలీవుడ్ లో చేస్తాడంటూ అప్పట్లో రూమర్లు వినిపించాయి. అలా అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ అనేది ఎప్పుడూ ఫిలింనగర్ లో హాట్ టాపిక్కే. తాజాగా ఈ పుకార్లపై మరోసారి వివరణ ఇచ్చాడు నాగార్జున. ఇప్పట్లో అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఉండదంటున్నాడు నాగార్జున. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, అఖిల్ ను బాలీవుడ్ […]

Advertisement
Update:2018-09-25 04:14 IST

ఈ పుకార్లు ఇప్పటివి కావు. అఖిల్ మొదటి సినిమా చేసినప్పట్నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, మొదటి సినిమా చేసిన వెంటనే, తన రెండో సినిమాను బాలీవుడ్ లో చేస్తాడంటూ అప్పట్లో రూమర్లు వినిపించాయి. అలా అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ అనేది ఎప్పుడూ ఫిలింనగర్ లో హాట్ టాపిక్కే. తాజాగా ఈ పుకార్లపై మరోసారి వివరణ ఇచ్చాడు నాగార్జున.

ఇప్పట్లో అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ ఉండదంటున్నాడు నాగార్జున. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్, అఖిల్ ను బాలీవుడ్ కు పరిచయం చేస్తానని తనను కోరాడని, కానీ తను మాత్రం వారించానని చెప్పుకొచ్చాడు. అఖిల్ బాలీవుడ్ కు వెళ్లడానికి ఇంకా చాలా టైం ఉందంటున్నాడు నాగ్. తెలుగులో ఓ మంచి బ్రేక్ వచ్చిన తర్వాత మాత్రమే అఖిల్ బాలీవుడ్ కు వెళ్తే బాగుంటుందనేది నాగ్ సూచన.

తను కూడా గతంలో శివ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాతే బాలీవుడ్ కు వెళ్లానని, ఇప్పుడు అఖిల్ కూడా తెలుగులో నిరూపించుకున్న తర్వాతే హిందీ చిత్రసీమలో అడుగుపెడితే బాగుంటుందని నాగ్ అన్నాడు. అయినా అఖిల్ బాలీవుడ్ ఎంట్రీపై ఎలాంటి కంగారు అక్కర్లేదని, ఎందుకంటే తనకున్న పరిచయాల ద్వారా అఖిల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బాలీవుడ్ కు వెళ్లొచ్చని నాగ్ క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు అఖిల్. కెరీర్ లో అతడికిది మూడో చిత్రం.

Tags:    
Advertisement

Similar News