పేదల సొమ్మును మోడీ ఆ పదిమందికే దోచిపెడుతున్నాడు....

కాంగ్రెస్ అద్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోడీని మ‌రోసారి టార్గెట్ చేశారు. రెండు రోజుల పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన అమేథీలో ప‌ర్య‌టిస్తున్న రాహుల్ రాఫెల్ డీల్‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. రాఫెల్ డీల్ ఎంత మొత్తానికి కుదిరిందో దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ దేశ‌పు కాపాల‌దారు పేద‌ల నుంచి డ‌బ్బుల‌ను కాజేసీ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి దోచి పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. రాఫెల్ డీల్ ఎంత‌కు కుదిరింది ? అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ ఎలా […]

Advertisement
Update:2018-09-24 12:49 IST

కాంగ్రెస్ అద్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌ధాని మోడీని మ‌రోసారి టార్గెట్ చేశారు. రెండు రోజుల పాటు త‌న నియోజ‌క‌వ‌ర్గ‌మైన అమేథీలో ప‌ర్య‌టిస్తున్న రాహుల్ రాఫెల్ డీల్‌పై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు.

రాఫెల్ డీల్ ఎంత మొత్తానికి కుదిరిందో దేశ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ దేశ‌పు కాపాల‌దారు పేద‌ల నుంచి డ‌బ్బుల‌ను కాజేసీ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి దోచి పెడుతున్నార‌ని మండిప‌డ్డారు.

రాఫెల్ డీల్ ఎంత‌కు కుదిరింది ? అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ ఎలా ద‌క్కింద‌నే విష‌యాలకు స‌మాధానాలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. దేశ ప్ర‌జ‌ల జేబుల్లోంచి 20 వేల కోట్లు తీసుకుని అనిల్ అంబానీ జేబులో నింపార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు.

రాఫెల్ డీల్‌పై వ‌స్తున్న‌ ప‌లు సందేహాల‌కు స‌మాధానం చెప్పే ధైర్యం మోడీకి లేద‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. పార్ల‌మెంట్‌లో రాఫెల్ డీల్‌పై చ‌ర్చ జ‌రిగే సంద‌ర్భంలో మోడీ త‌న క‌ళ్ల‌ల్లోకి కూడా చూడ‌లేక‌పోయార‌ని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

మోడీ ప్ర‌భుత్వ హ‌యాములో పేద‌లు, రైతులు క‌న్నీరు కారుస్తున్నార‌ని రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో ఐదు నుంచి ప‌ది మంది పారిశ్రామిక వేత్త‌ల‌కు మాత్ర‌మే మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు. అనిల్ అంబానీ, విజ‌య్ మాల్యా, ల‌లిత్ మోడీ… వంటి వారికే మోడీ మేలు చేస్తున్నార‌ని రాహుల్ గాంధీ ధ్వ‌జ‌మెత్తారు.

Tags:    
Advertisement

Similar News