ప్రణయ్‌ విగ్రహంపై నిరసనలు.... తల్లిదండ్రుల సంఘం భారీ ర్యాలీ

హత్యకు గురైన ప్రణయ్‌ విగ్రహాన్ని మిర్యాలగూడ సెంటర్ లో ఏర్పాటు చేసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మిర్యాలగూడలో అమ్మాయిల తల్లిదండ్రుల సంఘం స్థానిక మినీ రవీంద్రభారతితో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి భారీ స్థాయిలో అమ్మాయిల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఆడపిల్లలను రక్షించుకోవడం ఎలా అన్నదానిపై వారు చర్చించారు. ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుకు ఇప్పటికే కొందరు నిర్మాణాలు చేస్తుండడంతో మిర్యాలగూడ వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి బీజేపీ నేతలు కూడా మద్దతు […]

Advertisement
Update:2018-09-24 09:15 IST

హత్యకు గురైన ప్రణయ్‌ విగ్రహాన్ని మిర్యాలగూడ సెంటర్ లో ఏర్పాటు చేసేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మిర్యాలగూడలో అమ్మాయిల తల్లిదండ్రుల సంఘం స్థానిక మినీ రవీంద్రభారతితో సమావేశం నిర్వహించింది.

ఈ సమావేశానికి భారీ స్థాయిలో అమ్మాయిల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఆడపిల్లలను రక్షించుకోవడం ఎలా అన్నదానిపై వారు చర్చించారు. ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుకు ఇప్పటికే కొందరు నిర్మాణాలు చేస్తుండడంతో మిర్యాలగూడ వాసులు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీకి బీజేపీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. ర్యాలీలో భారీగా అమ్మాయిల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఏ అర్హత ఉందని ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని బీజేపీ నేతలు కర్నాటి ప్రభాకర్, న్యాయవాది చిలుకూరి శ్యామ్ ప్రశ్నించారు. హత్యను తాము కూడా ఖండిస్తున్నామని…. కానీ రెండు కుటుంబాల మధ్య గొడవను కులాలకు, మతాలకు ఆపాదించి సమాజ సమస్యగా మార్చడం సరికాదన్నారు.

ప్రణయ్ విగ్రహాన్ని అందరూ తిరిగే కూడలిలో ఏర్పాటు చేస్తే భావి తరాలకు తప్పుడు, చెడు సంకేతాలు పంపినట్టు అవుతుందని వారు వ్యాఖ్యానించారు. కావాలంటే ప్రణయ్‌ విగ్రహాన్ని కుటుంబసభ్యులు వారి సొంత స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని ర్యాలీలో పాల్గొన్న వారు సూచించారు.

భవిష్యత్తులో పిల్లలు ప్రణయ్ విగ్రహాన్ని చూసి ఆయన చేసిన గొప్ప ఏంటని ప్రశ్నిస్తే ఏం చెప్పాలని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ర్యాలీగా వెళ్లిన జనం డీఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పురపాలక కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News