అభిమానుల తీరుపై పవన్‌ కల్యాణ్‌ అసహనం

గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుకు పరామర్శ. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌ అని హెచ్చరించిన పవన్‌

Advertisement
Update:2024-12-28 14:20 IST

ఏపీ డిప్యూటీ సీఎం కడప రిమ్స్‌లో గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించారు. ఇదిలా ఉండగా.. పవన్‌ను చూడటానికి అక్కడికి వచ్చిన పలువురు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతున్న సమయంలో 'ఓజీ ఓజీ' అంటూ అభిమానులు స్లోగన్స్‌ చేశారు. అభిమానుల తీరుపై పవన్‌ అసహనం వ్యక్తం చేశారు. ఏంటయ్యా.. ఎప్పుడు ఏం స్లోగన్స్‌ ఇస్తున్నారని అని అన్నారు.

అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదని పవన్‌ విమర్శించారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారా.. ఖబడ్దార్‌ అని హెచ్చరించారు. గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును అమానుషంగా కొట్టారు. ఇష్టారాజ్యంగా అధికారులపై దాడి చేస్తే ఉపేక్షించమన్నారు. వైసీపీ వాళ్లకు అహకారంతో కళ్లు నెత్తికెక్కాయని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారిని ఎరూ రక్షించలేరు. కూటమి ప్రభుత్వం అంటే ఏమిటో చేసి చూపిస్తామని పవన్‌ హెచ్చరించారు. 

పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉన్నారు. వరుసగా అధికారిక కార్యక్రమాలతో పాటు మీటింగ్స్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు డైరెక్టర్‌-నిర్మాతలకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అంగీకరించిన మూవీలను పూర్తి చేస్తున్నారు. తన తదుపరి సినిమాలు ఓజీ, హరిహర వీరమల్లు షూట్స్‌లో వీలు కుదిరినప్పుడు పాల్గొంటుననారు. సుజీత్‌ డైరెక్షన్‌లో ఆయన నటిస్తున్న మూవీనే ఓజీ, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కుతున్నది. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్నది.

Tags:    
Advertisement

Similar News